»Gaston Glock The Inventor Of The Glock Pistol Dies
Gaston Glock: పిస్టల్ గ్లాక్ రూపకర్త మృతి
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పిస్టల్ గ్లాక్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజినీర్ గాస్టిన్ గ్లాక్ తుది శ్వాస విడిచారు. ఈ పిస్టల్ గ్లాక్ గన్ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలు, నేరగాళ్లు విపరీతంగా ఇష్టపడతారు.
Gaston Glock: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పిస్టల్ గ్లాక్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజినీర్ గాస్టిన్ గ్లాక్ తుది శ్వాస విడిచారు. ఈ పిస్టల్ గ్లాక్ గన్ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలు, నేరగాళ్లు విపరీతంగా ఇష్టపడతారు. 1929లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో గాస్టిన్ గ్లాక్ జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన గాస్టిన్ మొదటిగా నిత్యావసర వస్తువుల వ్యాపారం నిర్వహించారు. 1980లో సైన్యానికి వస్తువులు సరఫరా చేసే వ్యాపారం చేశారు. ఈ సమయంలో ఆస్ట్రియా దళాలు సరికొత్త పిస్టల్ కోసం చూస్తున్నట్లు గాస్టిన్ తెలుసుకున్నారు.
52 ఏళ్ల వయస్సులో తుపాకీని డిజైన్ చేశారు. ఈ తుపాకీ 18 రౌండ్లు కాల్చగలదు. గన్ కల్చర్ విపరీతంగా అమెరికాలో ఉండటంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. హాలీవుడ్ బ్లాక్‌బ్లస్టర్ ది మ్యాట్రిక్స్ రీలోడెడ్ వంటి చిత్రాలతో ఈ గన్ బాగా పాపులర్ అయ్యింది. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అమెరికా సైన్యం నుంచి తప్పించుకుని దాక్కొన్న సమయంలో కూడా ఆయన వద్ద గ్లాక్ గన్ ఉందని అమెరికా సైన్యం తెలిపింది.
గ్లాక్ 1962లో హెల్గా అనే మహిళలను పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి ముగ్గురు పిల్లలు. 1999లో చార్లెస్ ఎవెర్ట్ అనే ఫైనాన్షియల్ అడ్వెజర్ గ్లాక్ సొమ్మును అపహరించడంతో పాటు హత్య చేయడానికి కూడా పాల్పడ్డాడు. గ్లాక్ ఆ దాడిని తట్టుకుని హంతకుడిపై ఎదురుదాడి చేసి కుప్పకూల్చాడు. తర్వాత 2011లో హెల్గా నుంచి గాస్టిక్ విడిపోయారు. 2012లో ఆమె గాస్టిక్ జీవితంపై పుస్తకాన్ని రచించింది. అయితే ప్రపంచంలో ఏకాంతంగా గడిపిన బిలియనీర్లలో గ్లాక్ ఒకరు. కంపెనీ ఎదిగే కొద్దీ ప్రపంచానికి ఈయన ప్రపంచానికి దూరంగా జీవించారు.