»Rachakonda Crime Report Of The Year Increased Crimes
Rachakonda పరిధిలో పెరిగిన నేరాలు.. ఇదిగో నివేదిక
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల రేటు 6.86 శాతం పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.
Rachakonda crime report of the year.. increased crimes
Rachakonda: గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల(crime) రేటు పెరిగినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. అన్ని విభాగాల్లో నేరాలు పెరిగాయని(increased) పేర్కొన్నారు. రాచకొండ(Rachakonda) కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.86 శాతం పెరిగినట్లు వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు విడుదల చేశారు. దొంగతనాలు, దోపిడిలతో పాటు సైబర్ నేరాలు ఘననీయంగా పెరిగాయి. యువతే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తెలిపారు. అలాగే మాదకద్రవ్యాలు వినియోగం కూడా పెరిగిందని, గంజాయిలాంటి మత్తు పదార్థాలు గ్రామలకు కూడా విస్తరించాయని విచారణ వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టెందుకు పోలీసు శాఖ కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సుధీర్ బాబు వివరించారు.
రాచకొండ పరిధిలో సైబర్ నేరాలు(Cyber crimes) 25 శాతం పెరిగాయి. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ సంవత్సరం మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి.
మానవ అక్రమ రవాణకు సంబంధించి మొత్తం 58 కేసుల్లో 163 మంది అరెస్ట్ అయ్యారు.
గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదు అయ్యాయి, అందుకుగాను 972 మంది అరెస్ట్ అయ్యారు.
మాదకద్రవ్యాలకు సంబంధించి 282 కేసుల్లో 698 అరెస్ట్.. అందులో 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు అయ్యింది.
ఈ ఏడాది నేరాల్లో 5,241 కేసుల్లో శిక్షలు ఖారారు అయ్యాయి. 20 మందికి జీవిత ఖైదు పడింది. 62 శాతం కన్విక్షన్ రేటు పెరిగింది.