The Village: 2005 తోటకూడి ప్రాంతంలో ఒక ప్రదేశం అని టైటిల్ పడుతుంది. ఒక వ్యాన్ వస్తుంది. రొడ్డు మీద చెట్టుపడిపోవడంతో వ్యాన్ ఆగుతుంది. అందులో ఉన్నవారు దిగి చెట్టును పక్కను నెడుతుండగా.. వ్యాన్ లో ఉన్న మహిళకు నొప్పులు ఎక్కవ అవుతాయి. చేసేది ఏమిలేక వ్యాన్ వెనక్కు తిప్పుకొని పాత రొడ్డు ద్వారా ఆసుపత్రికి వెళ్దాం అని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో అక్కడ కొంతమంది దుండగులు ఉంటారు. మాల మనసు కీడును శంకిస్తుందని మనం ఏ దారి నుంచి వెళ్తున్నాము అంటే.. కట్టియాల్ దారి గుండా అని సేతు చెప్తాడు. దానికి మాల భయపడుతుంది. నీకు ఏం కాదని సేతు ధైర్యం చెప్తాడు. అదే సమయంలో వ్యాన్ కు అడ్డంగా ఒక వ్యక్తి వచ్చి కిందపడుతాడు. ఎవరో ఏంటో చూద్దామని సేతు కిందికి దిగి చూస్తాడు. పడిపోయిన వ్యక్తి అతనికి తెలుసు అని, తనతో పాటే కిందికి దిగిన అతన్ని ఏదో అడుగుతుండగా అతని తల నుంచి కత్తి దూసుకువస్తుంది. తల సగం కట్ అవుతుంది. షాక్ లో ఉన్న సేతు అతని వద్దకు వెళ్లగా పైన కొందరు కనిపిస్తారు. వ్యాన్ లో ఉన్నవారిపై విల్లులతో ఎటాక్ చేస్తారు. అందరిని చంపేస్తారు. సేతును పొడిస్తారు. అదంతా చూసి మాల ఏడుస్తుంది. టైటిల్స్ పడుతుంటాయి.
చదవండి:Ranbir Kapur: కెమెరాకు చిక్కిన అలియా కూతురు.. ఎంత క్యూట్‌గా ఉందో
సింగపూర్ ఒక తండ్రి ఫోటోను చూస్తూ ఉంటాడు ప్రకాశ్. చేతులో ఒక ఆకారంలో ఉన్న పేపర్ పట్టుకొని తిప్పుతుంటాడు. జగన్ ఫరాన్ ను తీసుకొని వస్తాడు. కట్టియాల్ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి కొన్ని శాంపిల్స్ కావాలని, జగన్ మీతో వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. దానికి జగన్ భయపడుతూ.. ప్రకాశ్ వెనకాలే వెళ్లి నేను ఎలా వెళ్లగలను అంటే నువ్వే కదా దాని గురించి తెలసి బతికున్న వ్యక్తివి, నీ గురించి నీ భార్యకు పిల్లలు చెప్పమంటావా అని బెదిరిస్తాడు. జగన్ నిస్సహాయంగా చూస్తాడు.
తరువాత సీన్లో బార్లో అందరూ మందు తాగుతుంటారు. అక్కడ పీటర్ అందరితో సరదాగా మాట్లాడుతూ పలకరిస్తుంటాడు. అక్కడికి శక్తి వచ్చి మనం తాగుదామా అంటూ మాట్లాడుతాడు. గుళ్లో సంబరాలు చేయడం సంతోషంగా ఉందని అంటాడు. నెక్ట్స్ సీన్లో తోటకూడి దగ్గర గౌతమ్ కార్లో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏం జరిగిందో అని గౌతమ్ కిందకు దిగుతాడు. అక్కడో యాక్సిడెంట్ జరుగుతుంది. క్లియర్ కావాడానికి లేట్ అవుతుందని తన వైఫ్ నేహతో చెప్తాడు. తన కూతురు మాయ కుక్కతో ఆడుకుంటు ఉంటుంది. దాని పేరు హెక్టిక్. ఏదైనా షాట్ కట్ రూట్ వెతుకుతా అని గూగుల్ మ్యాప్ చూస్తే.. కట్టియాల్ నుంచి షార్ట్ కట్ రూట్ కనిపిస్తుంది. తరువాత కారును యూటర్న్ తీసుకొని వెళ్తారు. అలా మట్టి రోడ్డులో జీపీఎస్ చూసుకుంటూ వెళ్తుంటారు. ఈ దారిలో ఎవరు వెళ్లినట్లు లేదని, తిరిగివెళ్దామని చెప్తుంది నేహ. అక్కడే కట్టియాల్ 5 కిలోమీటర్ల్ బోర్డు కనిపిస్తుంది. కారు చీకట్లోకి ఎంటర్ అవుతుంది. టైర్ పంచర్ అయిన సౌండ్ వినిపిస్తుంది. గౌతమ్ కిందకు దిగి చూస్తాడు. రెండు టైర్లు పంచర్ అవుతాయి, ఫోన్లో కూడా సిగ్నల్ ఉండదు. అక్కడే స్టక్ అవుతారు. దగ్గర్లో ఏదైనా హెల్ప్ దొరుకుతుందోమో అని, మాయను, నేహను కార్లోనే వదిలేసి గౌతమ్ నడుచుకుంటూ వెళ్తాడు.
తరువాత సీన్లో ఫరాన్ టీమ్ ఫ్లైట్‌లో కట్టియాల్ ప్రాంతానికి వస్తుంటారు. గన్స్ సర్దుతూ ఉంటారు. ఆ గ్యాంగులో ఒక వ్యక్తికి వాప్టింగ్ వస్తుందని ఇబ్బంది పడుతుంటాడు. అంతలో ఏదో సౌండ్ వినిపిస్తుంది. కట్టియాల్ కు వచ్చేశామని జగన్ చెప్తాడు. నెక్ట్స్ సీన్లో శక్తి, పీటర్, కరు కలిసి మందు తాగుతుంటారు. ఏదో పిచ్చపాటిగా మాట్లాడుకుంటారు. అక్కడికి గౌతమ్ వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని అడుగుతాడు. అందరూ ఎవరితను అని చూస్తారు. ఎవరు నువ్వు అని శక్తి అడిగితే అతను అడవిలో ఇరుక్కుపోయినట్లు చెప్తాడు. ముందు నువ్వు మందు తాగు అని పీటర్ బాటిల్ ఇస్తాడు. తాను డాక్టర్ అని పరిచయం చేసుకుంటాడు. తన కారును కట్టియాల్ లో వదిలేసినట్లు చెప్తాడు. ఆ పేరు వని అందరు షాక్ అవుతారు. ఒక అతను గౌతమ్ దగ్గరకు వచ్చి తప్పు చేశావు అంటాడు. నన్ను బయపెట్టడం ఆపీ,హెల్ప్ చేయండి అని అడుగుతాడు. అక్కడ భూతాలు ఉంటాయని, చాలా సంవత్సరాలుగా ఆ చోటుకు ఎవరు వెళ్లట్లేదని చెప్తారు శక్తి. దానికి గౌతమ్ ఫ్రస్టేట్ అయి అందరిని తిట్టి, మందు తాగుతాడు. అక్కడే ఉన్న కత్తి తీసుకొని బయలుదేరుతాడు. అక్కడ ఉన్న పీటర్, శక్తి వాళ్లు అలానే చూస్తారు.
తరువాత సీన్లో కార్లో మాయతో నేహ హ్యారిపోర్టర్ గురించి చెప్తుంది. వాళ్ల దగ్గక ఆ బుక్ కూడా ఉంటుంది. అంతలో హెక్టిక్ అరుస్తుంది. దానికి టాయిలెట్ వస్తుందేమో అని మాయ చెప్పడంతో, హెక్టిక్ కు టాయిలేట్ చేయిస్తా అని నేహ కారు దిగితుంది. అదే సమయంలో కుక్క కారు దిగి పారిపోతుంది. దాన్ని వెతుక్కుంటూ నెహ పరుగెడుతుంది. కొంత దూరం వెళ్లాక నేహ ఆగి హెక్టిక్ అని పిలుస్తుంది. అందే సమయంలో అక్కడికి తన కూతురు మాయ వస్తుంది. మాయను వెళ్లి కార్లో కూర్చో అని నెహ చెప్తుండగా.. నెహ కాలుకు ఏదో లాక్ పడుతుంది. తనను ఏదో లాక్కెళ్తుంది. మాయ వెనుకాలే అమ్మా అంటూ అరుస్తూ వెళ్తుంది. తన చేతులో ఉన్న హరిపోటర్ బుక్ కిందపడేస్తుంది. అమ్మా అంటూ పరుగెత్తి ఒక చోట ఆగి అలా పైకి చూస్తుంది.
రెండు వారాల ముందు కట్టియాల్ ప్రాంతానికి శాంపిల్స్ కోసం ప్రకాశ్ ఒక గ్యాంగ్ ను పంపిస్తాడు. వారు మాస్కులు, ల్యాబ్ డ్రెస్ వేసుకొని అడవిలో వెతుకుతుంటారు. అక్కడో వింత పువ్వు కనిపిస్తుంది. రేడియస్ లేవల్స్ ను చెక్ చేస్తుంటారు. అదే సపమమయయంలో అక్కడ రేడియేషన్ సౌండ్ వినిపిస్తుంది. చెట్టు దగ్గర ఏదో ఉందని అదేంటని చూస్తుంటాడు. వేరే పర్సన్ కు కూడా రేడియస్ యాక్టివేట్ అయిందని, ఇక్కడ ఏదో క్రేజీగా ఉందని చెప్తుండాగా అతని బాడీనుంచి ఒక విల్లు దూసుకెళ్తుంది. తరువాత చెట్టులోంచి ఏదో వచ్చి మరో వ్యక్తిని లాక్కెళ్తుంది. కట్ చేస్తే గౌతమ్ తన భార్యకూతుర్లను వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు. గాడిదల్లా వయసు వచ్చినా కూడా భూతాలు, పిశాచాలు అని కారణాలు చెప్తున్నారని తిట్టుకుంటూ అడవిలోకి వెళ్తుంటాడు. అదే సమయంలో ఏదో అలికిడి వినిపించి ఎవరు అని అటు ఇటు చూస్తాడు. వర్షం స్టార్ట్ అవుతుంది. పక్కనే ఉన్న ఒక చెట్టుకున్న ఆకును కట్ చేసి నెత్తిన పెట్టుకొని వెళ్తాడు. తరువాత దారిమరిచిపోయినట్లు అటు ఇటు చూస్తాడు. ఏదో తట్టి కింద పడిపోతాడు. అదే సమయంలో అక్కడికి ఎవరో వస్తారు.
తరువాత సీన్లో ప్రకాశ్ కు తాను ఇక నడవలేడని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చి ఇంజక్షన్ ఇచ్చుకోవవడానికి ట్రైస్తాడు. అదే సమయంలో బెల్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండుకు ప్రకాశ్ చిరాకు పడుతాడు. అక్కడికి జగన్ వచ్చి మీ నాన్న రమ్మన్నాడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో ఫరాక్ గ్యాంగ్ కట్టియాల్ కోస్టల్ ప్రాంతంలో దిగుతారు. అడవిలోకి అందరూ గన్ లు, లైట్స్ పట్టుకొని వెళ్తుంటారు. జగన్ ఏదో ట్రాన్స్ లో ఉంటాడు. జగన్ ఎందుకు భయపడుతున్నారు అని, ఈ ప్లేస్ గురించి తెలుసా అని ఫరాక్ అడుగుతాడు. అతను సైలెంట్ గా ఉంటాడు. అంతలో ప్రకాష్ ఫోన్ వస్తుంది మాట్లాడుతాడు. త్వరగా పనిపూర్తి చేయండి లేదంటే ఒక క్లిక్ తో నీ గురించి అందరికి తెలిసిపోతుంది అని బెదిరిస్తాడు ప్రకాష్. ఫరాక్ గ్యాంగ్ ను త్వరగా అందరిని వర్క్ పూర్తి చేయమంటాడు.
కట్టియాల్ లోని ఒక ప్రాంతం అనే టైటిల్ పడుతుంది. గౌతమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే పీటర్ గౌతమ్ కు గొడుకు పడుతాడు. పక్కనే శక్తి, కరుణంగం కూడా ఉంటాడు. బారులో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నట్లు గౌతమ్ చెప్తాడు. తరువాత వాన తగ్గేలా లేదని మాట్లాడుకుంటారు. నలుగురు కలిసి ట్రాక్టర్ ఎక్కి అడవిలోకి వాళ్లను వెతకడానకి వెళ్తారు. అదే సమయంలో తన కొడుకు సేతు, కోడలు మాల గురించి చెప్పి మెకానిక్ కురు బాధపడుతాడు. పోలీసులు కూడా దాని గురించి పట్టించుకోలేదని, పైగా ఎవరు అడవిలోకి వెళ్లోద్దన్నట్లు చెప్తారు.
మరో సీన్లో ఫరాన్ గ్యాంగ్ అడవిలో వెతుకుతూ ఉంటారు. ఐప్యాడ్ లో మ్యాప్ చూసి డైరెక్షన్ చేస్తాడు. అందరూ అతన్నే అనుసరిస్తారు. జగన్ స్మోక్ చేస్తుంటే ఆ గ్యాంగ్ లో హప్పి అనే అమ్మాయి స్మోక్ ఆపండి, అనవరసరంగా అడవిలో ఉన్న వాటిని నిద్రలేపకండి అంటుంది. దాంతో జగన్ సిగరేట్ పడేస్తాడు. గౌతమ్ ట్రాక్టర్లో వస్తూ.. అసలు కట్టియాల్ లో ఏం జరిగింది అని వారిని అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్.. 1989 కట్టియాల్ అనే టైటిల్ పడుతుంది. అందరూ పనిచేస్తుంటారు. మట్టి తొవ్వుతుంటారు. అక్కడ పని చేసే పావజకోడికి మెడ నొప్పిగా ఉంటే కరుణంగం కాసేపు పని చేయకు అని చెప్తాడు. అదే సమయంలో చిన్నపిల్లోడు సేతు కిందపడిపోతాడు. కరుణంగం అతన్ని ప్రేమగా చూసుకుంటాడు. పెద్దోడివై డాక్టర్ కావాలని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి సైరాజు మనుషులు వచ్చి ఇక ఈ ప్రదేశం కొన్రాజుకే సొంతం అని చెప్తాడు. ఇతను చెప్పినట్లే మీరంతా చేయాలని అంటాడు. దాంతో పనివాళ్లపైనా కొన్రాజు అరుస్తాడు. పనిచేయమని భూతులు మాట్లాడుతాడు. అన్నం తింటున్న సేతును, ఒక ముసలోన్ని కొడుతాడు కొన్రాజు. కొడుకును కొట్టడంతో కొన్రాజుపై కరుణంగం చేయి చేసుకుంటాడు. అది చూసి సైరాజు తిడుతాడు. అన్నను ఇంటికి పంపించి కొన్రాజు భూతులు తిడుతాడు. తరువాత వారి మధ్య గొడవ జరుగుతుంది. గన్ తో కరుణంగంను కొట్టి గాల్లో గన్ కాలుస్తాడు. అందరూ భయపడిపోతారు. పావజకోడి బట్టలు చించేస్తాడు. అక్కడున్న కూలీలందరు వద్దు అని ఏడుస్తారు. ఇంకెవరన్నా అరిస్తే అందరికి ఇదే గతి పడుతుందని కొన్రాజు అనడంతో.. అవమానంగా భావించిన పావజకోడి కత్తితో గొంతు కోసుకుంటుంది. అందరూ ఒక్క సారిగా షాక్ అవుతారు.
పావజకోడికి చితిపెట్టిన తరువాత కరుణంగం ఊరి మనుషులను తీసుకొని కొన్రాజు మీద దాడికి వెళ్తాడు. అదే కోపంతో కొన్రాజు ప్రయివేట్ పార్ట్స్ ను కోసేస్తాడు కరణంగం. తరువాత సైరాజు ఇంటికి కరణంగం తన గ్యాంగ్ తో వస్తాడు. అక్కడ పెద్ద గొడవ జరుగుతంది. కూలోల్లు ఎక్కడుండాలో అక్కడే ఉండాలని, మీరు మా దాసులని సైరాజు అంటాడు. అదే సమయంలో అక్కడికి శక్తి వచ్చి గొడవను ఆపుతాడు. అందరిని పంపించేస్తాడు శక్తి. అదే విషయాన్ని చెప్తే… అప్పటికి ఇప్పటికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గౌతమ్ అంటాడు. కారు ఆగిన చోటు వచ్చిందని, అక్కడ కారు లేకపోవడంతో గౌతమ్ పరుగెత్తుకుంటు వెళ్తాడు. కారు గుర్తులను చూపించి నేహా, మాయ అంటు అరుస్తాడు. వాళ్లు కూడా ఆలోచనలో పడుతారు. అక్కడే హ్యారిపోర్టర్ బుక్ కనిపిస్తుంది. గౌతమ్ అనుమానపడుతూ చూస్తాడు. కారు కట్టియాల్ లోపలికి తీసుకెళ్లారా అని ముగ్గురు ఆలోచిస్తుంటారు.
కారును ఎవరో చైన్ కట్టి లాక్కుల్లుతారు. కట్ చేస్తే ఫరాన్ గ్యాంగ్ అడవిలో వెతుకుతుంటారు. అక్కడ కొన్ని వస్తువులు కనిపిస్తాయి. దాంతొ మాకంటే ముందు ఇక్కడికి ఎవరన్నా వచ్చారా అని జగన్, ఫరాక్ అడుగుతాడు. జగన్ ఏమి చెప్పడు. అదే సమయంలో బాణం తగిలిన మనిషి చెట్టుకు వెళాడుతుంటాడు. అది లాగితే బాడీ అంతా కుళ్లిపోయి ఉంటుంది. కేవలం హెడ్ మాత్రం కిందపడుతుంది. కట్ చేస్తే ప్రకాశ్ ను తన తండ్రి వద్దకు తీసుకెళ్తాడు జగన్. తండ్రి అంటే ప్రకాష్ కు ఇష్టం ఉండదు. నీవు నడవడానకి చాలా ప్రయత్నాలు చేశానని, అతని ఒక ఫైల్ ఇస్తాడు. అందులో ఫోటోలను చూస్తాడు ప్రకాష్. 1989 సింగపూర్ టైటిల్ పుడుతుంది. ప్రకాష్ నడవడం కోసం తన తండ్రి ఎలుకలపై ప్రయోగం చేస్తుంటాడు. ఆ సమయంలో లాంటనైట్ అనే కెమికల్ కనుకున్నట్టు.. దాంతో కట్టియాల్ ప్లేస్ ను చూసినట్లు చెప్తాడు. కట్ చేస్తే గౌతమ్, శక్తి ట్రాక్టర్ పై ఓ ప్లేస్ కు వస్తారు. అక్కడ ఇళ్లుల అనవాళ్లు కనిపిస్తాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే సూనామి వచ్చి అంతా నాశనం అయిందని కరు చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. 1991 కట్టియాల్ అనే టైటిల్ పడుతుంది. అక్కడే కరుణంగం కూలిమనుషులతో గుడిసెల్లో ఉంటారు. అదే సమయంలో అక్కడి ఆఫీసర్లు వచ్చి ఇళ్లు పడగొడుతారు. ఎందుకు పడగొడుతున్నారు అని కరుణంగం అడిగితే దీని ఓనర్ సైరాజు మాకు అమ్మాడు అని చెప్తాడు. దాంతో కరుణంగం తన గ్యాంగ్ తో సైరాజు ఇంటికి వెళ్లి అడుగుతాడు. మీ తాతాలు మిమ్మల్ని మా కుటుంబానికి అమ్మెశారు అని, మీకు అడిగే హక్కు లేదని సైరాజ్ చెప్తాడు. కరుణంగం తన ముఠా సైలెంట్ అవుతారు. అక్కడికి శక్తి వచ్చి వారికి హెల్ప్ చేస్తా అంటాడు. అదే సమయంలో శక్తి వాల్ల అమ్మకు దేవుడు పూనుతాడు. వీరంతా మట్టిలో కలిసిపోతారు అని శాపం పెడుతుంది. తరువాత కరుణంగం తన కూలీలతొ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతాడు.
మరోసీన్‌లో ఫరాన్ గ్యాంగుకు దొరిగికిన హెడ్ ను పరిశీలిస్తారు. అదే సమయంలో అసలు ఇక్కెడ ఏం జరిగింది. మాకంటే ముందు వచ్చిన వారేనా అనే క్వశ్చన్లు అడుగుతారు. జగన్ వేటికి సమాధానాలు చెప్పడు. ప్రకాష్ తో ఫోన్ మాట్లాడుదామంటే ఫోన్ రీచ్ అవదు. త్వరగా పదండి ఫ్యాక్టరీలో కూడా సాంపీల్స్ కలెక్ట్ చేయాలని అంటాడు. దాంతో డాక్టర్స్ కొంచెం ఆలోచిస్తుంటారు. తరువాత అందరూ ముందుకు వెళ్తారు. పుర్రెలోంచి జెర్రి బయటకు వస్తుంది. అడవిలో వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది గ్యాంగ్. ఇంకో తల కనిపిస్తుంది. చెట్టును పరిశీలిస్తుంటే పైనుంచి ఒక సైంటిస్ట్ బాడీ కిందపడుతుంది. దాంతో అందరూ భయపడుతారు. అదే సమయంలో ఒక అరుపు వినిపిస్తుంది. అంతలో ఒకఅతన్ని చెట్టుపైకి తీసుకెళ్తుంది పిశాచి. తరువాత అతను కింద పడుతాడు. వెంటనే గన్ ఫైర్ చేస్తారు.
మరో సీన్లో నేహను కట్టేస్తారు. మాయ బోనులో ఉంటుంది. అక్కడ కొన్ని వింత జీవులు, పిశాచాలు తిరుగుతుంటాయి. నేహ వాటిని చూసి భయపడుతుంది. నెక్ట్స్ సీన్లో ఫరాన్ టీమ్ తన ఫ్రెండ్ కు సమాధి కట్టి ప్రేయర్ చేస్తుంటే జగన్ టైమ్ వేస్ట్ చేయకండి అంటాడు. దాంతో హప్పికి కోపం వస్తుంది. తరువాత ఫరాన్, జగన్ దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడుతాడు. ఆ గ్యాంగ్ లో సంజీవ్ మిస్ అయ్యాడు అని అందరూ వెతుకుతారు. చెట్టుదగ్గర ఒక ప్రాణి కదులుతున్నట్లు కనిపిస్తే దాన్ని ముట్టుకుంటాడు సంజీవ్. తరువాత వారిని కలుసుకుంటాడు. అందరూ సంజీవ్ ను తిడుతారు.
మరోసీన్‌లో గౌతమ్, శక్తి వాళ్లు ట్రాక్ట్రర్ పై వస్తూ.. ఒక ఇంట్లో వెలుతురు కనిపిస్తే ఆగుతారు. అదే శక్తి వాళ్ల పాత ఇళ్లు. వెతుక్కుంటూ లోపలికి వెళ్తారు. అక్కడ రెండు తోకల ఎలుక కనిపిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపడుతారు. తరువాత డోర్ ను తెరిచి ఇంట్లోకి వెళ్తారు. అక్కడో పెద్ద చెట్టు ఉంటుంది. దానికన్ని పుర్రెలు ఉంటాయి. తరువాత గౌతమ్ మీద బ్లడ్ పడుతుంది. ఏంటాని పైకి చూస్తే ఇద్దరు పిశాచాలు మీద పడుతాయి. గౌతమ్ తన దగ్గర ఉన్న కత్తితో పొడుస్తాడు. శక్తి గన్ తో కాలుస్తాడు. అలా వస్తూనే ఉంటాయి. అన్నింటిని కొట్టి చంపేస్తారు. అదే సమయంలో ఒక పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి కుక్కలును పట్టుకొని ఉంటాడు. వాటిని చూసి వీరు పరుగెడుతారు. తరువాత వీధిలోకి వెళ్లగానే ఆ కుక్కలు వెంటపడుతాయి. వీరి మీద ఎటాక్ చేస్తాయి. పీటర్ ఒక బావిలో దూకుతాడు. పీటర్ ను వెతుకుతూ బావిదగ్గరకు వెళ్తారు. అక్కడ టార్చ్ దొరకుతుంది. అదే సమయంలో మరికొన్ని కుక్కలు వీరివైపే వస్తుంటాయి. అందరు కలిసి బాయిలో దూకుతారు.
కట్ చేస్తే గౌతమ్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. నేహ గౌతమ్ ను లేపుతూ ఉంటుంది. తరువాత బెడ్ పై ఇద్దరు రొమాంటిక్ మూడ్ లో ఉండగా అక్కడికి మాయ వస్తుంది. రోడ్డు ట్రిప్ వెళ్లాలని మాయ అరుస్తుంది. అలా వచ్చి ట్రిప్ కోసం ఇలా ఇరుక్కుపోయారు. కట్ చేస్తే బావిలో పడ్డ గౌతమ్.. నేహా, మాయ అని అరుస్తాడు. తరువాత పీటర్ కాలు విరిగిందని పీటర్ అరుస్తాడు. గౌతమ్ అతనికి ట్రీట్ మెంట్ చేస్తాడు. బావిలో వేర్లు ఉంటాయి. లైట్ పెట్టి దారిని చూస్తుంటారు. అందరు కలిసి నడుచుకుంటూ వెళ్తారు. అది పాత గని అని వారే తవ్వారని కరుణంగం చెప్తాడు. అక్కడే ఒక కారు కనిపిస్తుంది. అక్కడే మాయ హెయిర్ పిన్ కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని పిలుచుకుంటూ పరుగెత్తుతాడు గౌతమ్. డెడ్ ఎండ్ ఉంటుంది. గౌతమ్ ఏడుస్తాడు. వాళ్లను ఒంటరిగా వదిలి వచ్చి ఉండకూడదు అని ఏడుస్తాడు. శక్తి, కరుణంగం ఓదారుస్తారు. కుటుంబం కోసం వెతుకుదాం అని చెబుతారు. అలా నడుచుకుంటూ సొరంగంలో వెళ్తారు. వాళ్లకు ఒక పాట వినిపిస్తుంది. అది వింటూ ముందుకు వెళ్తుంటారు. అక్కడ అరుపులు వినిపిస్తాయి. ఇక లేడిని బలివ్వడానికి రెడీ చేస్తాడు. అంతలోనే గౌతమ్ వెళ్లి అతన్ని కిందపడేస్తాడు. శక్తి గన్ పెడుతాడు. రారా ద్రోహి నా కొడుకా అని అంటాడు సైరాజు.
తరువాత సీన్లో నేహ చేతులు, కాళ్లు కట్టేసి ఉంటుంది. మాయ అమ్మా అని అరుస్తుంది. అక్కడే ఉన్నపొట్టోడు మాయకు బొమ్మ ఇచ్చి ఆడుకో అంటాడు. మరో సీన్లో ఫరాక్ గ్యాంగ్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ శాంపిల్స్ తీసుకోవడానికి వెళ్తారు. మరో సీన్లో సైరాజు నవ్వుతుంటాడు. అతని అవతారం చాలా భయంకరంగా ఉంటుంది. గౌతమ్ ఫ్యామిలీ గురించి అడిగితే నవ్వుతాడు. కరుణంగం ముందుకెళ్లి కొట్టేలోపూ అతన్ని మెడపట్టి పైకి లేపుతాడు. గౌతమ్ కొడుతాడు. తరువాత సైరాజ్ కళ్లు తెరుస్తాడు. నేహ, మాయల గురించి అడిగితే వాళ్లను మరిచిపో అంటాడు. దాంతో బండతో కాలుపై కొడుతాడు. సైరాజ్ నవ్వుతూనే ఉంటాడు. దాంతో నేను ఎం చేయాలో చెప్పు అని శక్తి సైరాజ్ తో అంటాడు. నువ్వు ఏం చేయలేవు.. అమ్మా ఇచ్చిన కొడుకు వస్తాడు అని సైరాజ్ అంటాడు. అంతలో పిశాచులను పిలిచి వీరిపై దాడి చేయమంటాడు. చాలా పిశాచులు వస్తాయి. వీరిపై ఎటాక్ చేస్తాయి. శక్తిని, పీటర్ ను కట్టి వేలాడదీస్తారు. కరుణంగం, గౌతమ్ లను కట్టేస్తారు. అక్కడికి పొట్టోడు వచ్చి ఆ పిల్ల నీళ్లు అడుగుతుంది అని సైరాజ్ తో చెప్తాడు. తన దగ్గర ఉన్న మెడికల్ బ్యాగ్ ను చూసి అది మాయది అని గౌతమ్ అంటాడు. దాంతో నాకు కాలు నొప్పి తగ్గడానికి మంచి మందు ఇవ్వు అని సైరాజ్ అంటే అతని మత్తు టాబ్లేట్స్ ఇస్తాడు గౌతమ్. అందులో నుంచి ఒక బ్లేడ్ ను తీసుకుంటాడు. ఆ మందులను మింగుతాడు సైరాజ్. అసలు ఏం జరిగిందో చెప్తా అని సైరాజ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
శక్తి.. కూలొల్లను, కరుణంగంను తీసుకొని బంజరుభూమికి వెళ్లిన తరువాత సైంటిస్ట్ వచ్చడాని చెప్తాడు. డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు అని చెప్తాడు. లాంటనైట్ ఎక్స్ పరిమెంట్ పేరుతో కట్టియాల్ లో 1996లో ఒక అండర్ గ్రౌండ్ ప్రయోగం మొదలుపెట్టినట్లు ప్రకాష్ తండ్రి చెప్తాడు. మరో వేపు ప్రయోగం కారణంగా కట్టియాల్ మొత్తం నాశనం అయిందని, వింత రోగాలు వచ్చాయని సైరాజ్ చెప్తాడు. తన ప్రయోగాలు ఫెయిల్ అవడంతో చాలా ఫ్రస్టేట్ అవుతాడు సైంటిస్ట్. అదే సమయంలో సైరాజ్ తన మనుషులతో ఫ్యాక్టరిపై దాడి చేస్తారు. తరువాత గ్రామాస్తులంతా ఊరు విడిచిపోతున్నమంటే సైరాజ్ భార్య శిగం ఊగుతుంది. వెళ్లిపోతున్నా అని ఒకరు అంటే అతని తల నరికేస్తుంది. ఇక 2004లో ఫ్యాక్టరీని ధ్వంసం చేయడానికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు. అదే సమయంలో అక్కడ సునామి వస్తుంది. అదే విషయాన్ని ప్రకాష్ కు చెప్తాడు సైంటిస్ట్. సైరాజ్ తన గ్యాంగుతో లోపటికి వెళ్తే ఎవరు లేరని, ఫ్యాక్టరీ టన్నెల్ లో ఉంటారు. అదే సమయంలో సునామి వస్తుంది. టన్నెల్ లో ఉన్నవారు పరుగెత్తుకుంటు వెళ్లి ఒక రూమ్ లో దాక్కుంటారు. సైరాజ్ వైఫ్ సుభద్ర కాలు ఇరుక్కుపోవవడంతో బయటే ఉండి డోర్ పెడుతుంది. అదే నీటిలో కొట్టకుపోతుంది. సైరాజ్ దారుణంగా ఏడుస్తాడు. విషయం తెలుసుకొని శక్తి కూడా ఏడుస్తాడు.
మరో సీన్లో ఆ కంపెనీని ఓపెన్ చేయకు అని ప్రకాష్ కు చెప్తాడు సైంటిస్ట్. అక్కడ నిధులు లేవు, పిశాచాలు ఉన్నాయని చెప్తాడు. కంపెనీని ఒదిలేసి హాయిగా ఉండమని చెప్తాడు. దానికి ప్రకాష్ ఒప్పుకోడు. తరువాత ప్రకాష్ బెడపైకి వచ్చి తన మాస్క్ లాగేస్తాడు. ప్రకాష్ తండ్రి చనిపోతాడు. తన తండ్రికి థ్యాంక్స్ చెప్తాడు. 2004లో ల్యాబ్ లో చిక్కుకున్న వాళ్లు బయటకు రాలేక అక్కడే ఉండిపోతారు. అలా రెండు మూడు నెలలు ఉండాల్సి వస్తుంది. ఆకలితో ఏడుస్తారు. చేసేది ఏమ్ లేక ల్యాబ్ ప్రయోగాల కోసం ఉన్న ఎలుకలను, కోతులను, కెమికల్స్ ను ఆహారంగా తీసుకుంటారు. వారికి పిచ్చిపట్టినట్లు బీహేవ్ చెస్తారు. సైరాజ్ కు సుభద్ర కనిపిస్తుంది. తన మాటలు వినిపిస్తాయి. దాంతో బలం తెచ్చుకొని డోర్ తెరిచి బయటకు వస్తారు. టన్నెల్ నుంచి బయటకు రాగానే ఒక వ్యక్తి సన్ లైట్ పడి కిందపడిపోతాడు.. అతన్ని ల్యాబ్ లోకి తీసుకెళ్తారు. అందరు కలిసి అతన్ని బాడీని తింటారు.
మరో వైపు ఫరాన్ గ్యాంగ్ ల్యాబ్ లోకి ఎంటర్ అవుతారు. అన్నింటిని వెతుకుతారు. అలా వెతుకుతూ ల్యాబ్ లోకి వెళ్లగానే అక్కడ వారికి ఒక వింత విగ్రహం కనిపిస్తుంది. తరువాత వెటయన్ ను పిలుస్తాడు సైరాజ. చాలా భయంకరంగా ఉన్న వెటయ్య వస్తాడు. శక్తిని చంపమని సైరాజ్ చెప్తే పీటర్ అతన్ని రెచ్చగొడుతాడు. దమ్ముంటే నన్ను తాకు అంటాడు. అందరు వద్దంటున్న పీటర్ వినడు. దాంతో వేటయ్య పీటరు చంపేస్తాడు. చిన్న పిశాచులకు తన మాంసాన్ని విసిరేస్తాడు.
తరువాత సీన్లో పీటర్ కు సారీ చెప్తాడు గౌతమ్. సైరాజ్ సృహతప్పి పడిపోతాడు. గౌతమ్ ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేశాయి అంటాడు. తరువాత మాయ అరుపు వినిపిస్తుంది. దాంతో అతని వేలు కోసుకొని సంకెళ్లు విడిపించుకుంటా అని బ్లేడ్ తీస్తాడు. అతన్ని వద్దని, కరు కత్తి లాక్కుంటాడు. అతని బొటన వేలు కోసుకుంటాడు. మరో వైపు ఫరాక్ గ్యాంగ్ అక్కడ అన్ని వింతగా ఉన్నాయి అని, అసలు ఎక్కడికి తీసుకొచ్చావు అని జగన్ ను అడుగుతారు. నేను మీతో పాటే వచ్చాను, ఇక్కడికి రాక దాదాపు 20 ఏళ్లు అవుతుందని చెప్తాడు. తరువాత ఆ బొమ్మ చాలా బాగుందని దగ్గరకు వెళ్లి చూస్తా అని చెప్పి.. అందరు వద్దు అంటున్నా దగ్గరకు వెళ్లి ముట్టుకుంటాడు. మొదట ఏం కాదు తరువాత ఆ బొమ్మ పొట్ట బాగం ముట్టుకోగానే తన చేయి తెగిపడుతుంది. రక్తం విపరీతంగా పోయి చనిపోతాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తే సౌండ్స్ వస్తాయి.
మరో సీన్లో గౌతమ్, శక్తిని కిందికి దించుతాడు. తన ఫ్యామిలీ ఎక్కడ ఉందని సైరాజ్ ను లేపి అడుగుతాడు. అతను చెప్పడు. అతన్ని కట్టేసి లాక్కెలుతారు. మాయ సౌండ్ వినిపించి లాక్కుళ్లుతారు. ఒక చోటుకు వెళ్లి అక్కడ చూడాగానే చాలా మంది బాడీలు ఉంటాయి. మళ్లీ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు సైరాజ్.. మా నుంచి గొడవ పెట్టుకొని వెళ్లి వారంతా సంతోషంగా ఉన్నారని, అలా ఉండకూడదు అనుకుంటారు. తరువాత వ్యాన్ యాక్సిడెంట్ జరగడం మాలను పట్టుకొని వెళ్లి డెలివరీ చేసి తన బిడ్డను చంపేసినట్లు సైరాజ్ చెప్తాడు. మాల రెండు చేతులు, కాళ్లు నరికి ఆ నీటిలో ఉందని చూపిస్తాడు. తనతో ఒక సైరాజ్ కన్న బిడ్డే వేటయ్య అని చెప్తాడు. శక్తి తన కుతురు మాల దగ్గరకు వెళ్లి చూస్తాడు. తాను నరకయాతన పడుతుంది. కోపంతో సైరాజ్ తల నరికేస్తాడు శక్తి. తరువాత మాల దగ్గరకు వెళ్లి బతికిస్తా అని ఏడుస్తాడు. మాల నొప్పిని భరించలేక పోతున్నా అని ఏడుస్తుంది. ఇక చేసేది ఏమిలేక తన శ్వాస ఆపేస్తాడు. గౌతమ్ వద్దంటే కరు ఆపుతాడు. మాల చనిపోతుంది. కరు, శక్తి ఇద్దరు ఏడుస్తారు.
మరో సీన్లో నేహా దగ్గరకు వేటయ్య వస్తాడు. మాయ అమ్మ అని అరుస్తుంది. నేహా ముట్టుకోవద్దు అని ఏడుస్తుంది. అక్కడికి పొట్టోడు వచ్చి
తనను ఏం చేయకు, ఇంకా పూజ చెయాలే అని చెప్తాడు. తరువాత గౌతమ్ వాళ్లకు మాయ అరుపు వినిపిస్తుంది. తనను వెతుక్కుంటూ బయటకు వస్తారు. మరో వేపు ఫరాన్ గ్యాంగ్ వెతుకుతుంటారు. వాళ్లపైన పిశాచాలు ఒక్కసారిగా ఎటాక్ చేస్తాయి. ఫరాన్ ను కొరుకుతాయి. తరువాత వాటిపై ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదని వెళ్లిపోవాలని అక్కడినుంచి మూవ్ అవుతారు. తరువాత ఆ సెల్ఫ్ లో సాంపిల్స్ ఉన్నాయని జగన్ చెప్తాడు. వాటికోసం ఫరాన్ వెళ్తాడు. మరో పిశాచి ఎటాక్ చేస్తుంది. దాన్ని కాల్చేస్తారు. తరువాత వెళ్లిపోదామని మాట్లాడుకుంటారు. అంతలో వేటయన్ వచ్చి జగన్ ను వెనక్కి లాగుతాడు. అందరూ కలిసి వేటయ్యపై షూట్ చేస్తారు. ఎన్ని బుల్లెట్లు కాల్చిన అతనికి ఏం కాదు. తరువాత హ్యప్పిని పట్టుకుని రెండుగా చీల్చేస్తాడు.
మరోసీన్‌లో నేహాను, మాయను వెతుక్కుంటూ గౌతమ్, శక్తి, కరు వస్తారు. వారి కట్లు విప్పేస్తారు. సంతోషంగా ఉంటారు. అదే సమయంలో వేటయ్య గొంతు వినిపిస్తుంది. బయట పడాలి అని అక్కడే ఉన్న పొట్టోడిని దారి అడుగుతారు. మరో సీన్లో ఫరాక్ హప్పి శవం దగ్గర ప్రేయర్ చేస్తాడు. జగన్ ఎక్కడ అని అరుస్తాడు. మరో సీన్లో పొట్టొడు వారికి దారి చూపిస్తూ మొట్లవరకు తీసుకెళ్తాడు.
కట్ చేస్తే గౌతమ్ ముందు వెళ్తుంటే కరు నేను ముందు వెళ్తా అంటాడు. తరువాత శక్తి వెళ్తాడు. ఆ తరువాత నేహ వెళ్తుంది. హెల్ప్ చేసినందుకు తన హెయిర్ పిన్ ను పొట్టోడికి ఇస్తుంది మాయ. అదే సమయంలో జగన్ శాంపిల్ కోసం లాకర్ రూమ్ దగ్గరకు వెళ్లి దాన్ని తీసుకొని వస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఫరాక్ జగన్ ను చూస్తాడు. శాటిలైట్ ఫోన్ తీసుకొని తన టీమ్ తో మాట్లాడుతాడు. ప్రకాశ్ కంపెనీ ఇల్లీగల్ అని, జగన్ ఫ్రాడ్ అని చెప్తాడు. వెంటనే ఫరాక్ అతన్ని కాల్చి చంపేస్తాడు. శాంపిల్స్ కిందపడిపోతాయి. అదే సమయంలో ప్రకాశ్ ఫోన్ చేస్తాడు. మిషన్ అయిపోయిందా.. అయిపోయిందని ఫ్లైట్స్ పంపించమని చెప్తాడు. తరువాత అక్కడికి గౌతమ్ వాళ్లు వస్తారు. వారికి గన్స్ పెడుతారు. అందరు కలిసి అక్కడినుంచి పారిపోవాలని అనుకుంటారు. మాయ అక్కడే పడి ఉన్న శాంపిల్స్ ను పట్టుకుంటుంది. తన చేతికి గాయం అవుతుంది. తరువాత అందరు కలిసి వెళ్లిపోవాలి అనుకుంటారు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంటారు.
అదే సమయంలో వెటయాన్ అక్కడికి వస్తాడు. అందరూ పరుగెడుతుంటారు. ఒక చోట దాక్కుంటారు. ఆ పిశాచాలను డైవర్డ్ చేసి పారిపోదామని ప్లాన్ చేస్తుండగా ఒక సైంటిస్టును పిశాచి పైకిి లాక్కెల్తుంది. చంపి కింద పడేస్తుంది. అక్కడి నుంచి అందరు పారిపోతారు. వెటయన్ ను మరో పోలీసు కాలుస్తుంటాడు. అతన్ని కూడా వెటయన్ చంపేస్తాడు. తరువాత శక్తి, కరులపై ఎటాక్ జరుగుతుంది. మరో వైపు ఫరాక్, గౌతమ్ కాలుస్తుంటారు. బయటకు వెళ్లడానికి ఫరాక్ బాంబును సెట్ చేస్తాడు. తరువాత వెటయన్ వస్తాడు. అందరిని కొడుతాడు. గౌతమ్ గన్ పట్టుకొని వెటయన్ ను రెచ్చగొడుతాడు. అతడు బాంబ్ దగ్గరకు వెళ్లగానే గౌతమ్ కాల్చేస్తాడు. వెటయన్ చనిపోయాడు అనుకొని వెళ్తుంటారు. అంతలో ఏదో అరుపు వినిపిస్తుంది. గౌతమ్ వెనక్కి వెళ్తాడు. వెటయన్ లేచి మళ్లీ బయటకు వస్తుంటే శక్తి అడ్డు పడుతాడు. వెటయన్ వినడు. నీ తల్లి దండ్రులను చంపింది నేనే అని చెప్తాడు. దాంతో శక్తి వైపు వస్తాడు. మనిద్దరితో ఇది అంతం కావాలి అని మొత్తం ఫ్యాక్టరీనే కాల్చేస్తాడు శక్తి. గౌతమ్ లోపలే ఉన్నాడు అనుకొని నేహ బాధపడుతుంది ఫరాన్ లోపలికి వెళ్లనివ్వడు అంతలో గౌతమ్ మెళ్లిగా నడుచుకుంటూ వస్తాడు. తరువాత వారు నడుచుకుంటూ కోస్ట్ ల్ వైపు వస్తారు.
రెండు హెలికాప్టర్స్ వస్తాయి. అక్కడే ప్రకాశ్ అండ్ తన టీమ్ కూడా ఉంటారు. ఇదింత మరిచిపోండి ఒక పీడకల అనుకోండి అని ప్రకాష్ అంటాడు. దాంతో గౌతమ్ అతన్ని కొడుతాడు. తరువాత చాపర్ ఎక్కబోతుంటే ఏదో అరిచినట్లు అనిపిస్తుంది. అందరు అలెర్ట్ అవుతారు. వాళ్ల కుక్క పరుగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని మాయ దగ్గరకు తీసుకొని సంతోషపడుతుంది. అందరూ హెలికాప్టర్ ఎక్కి కూర్చుంటారు. అదే సమయంలో ప్రకాష్ మనుషులు ఫ్యాక్టరీ నుంచి వేటయన్ తల, ఇద్దరు చిన్నపిల్లలు, పొట్టోడిని తీసుకొని వస్తారు.
తరువాత గౌతమ్ తన ఫ్యామిలతో సంతోషంగా ఉంటాడు. అంతలో అతనికి ఫోన్ వస్తుంది. మాయ హెక్టిక్ తో ఆడుకుంటుంది. ఫోన్లో ఫారాన్ మాట్లాడుతుంటాడు. అదే సమయంలో ప్రకాష్ ల్యాబ్ లోకి వస్తాడు. ఇంకా పూర్తిగా రెడీ అవని ఇంజక్షన్ చేతికి వేసుకుంటాడు. అదే సమయంలో పాపను కుక్క కరుస్తుంది. కాట్లు పడుతాయి. ఇంజక్షన్ తీసుకున్న ప్రకాష్ వీలు చైర్ నుంచి లేచి రెండు అడుగులు వేసి కింద పడుతాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. గౌతమ్ మీ ఫ్యామిలీకి రెడ్ అలెర్ట్ మామ డేంజర్ లో ఉందని చెప్తాడు. దాంతో గౌతమ్ షాక్ అవుతాడు.