Ranbir Kapur: బాలీవుడ్ స్టార్ కపుల్స్ అలియా భట్(Alia bhatt), రణబీర్ కపూర్(Ranbir Kapur) తమ కూతుర్ని ఇన్నాళ్లు బయట ప్రపంచానికి చూపించకుండా జాగ్రత్త పడ్డారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తమ కుమార్తే రాహా(Raha)ను మీడియా ముందుకు తీసుకొచ్చారు. అభిమానులకు సైతం దర్శనం కల్పించకుండా అపురూపంగా దాచుకున్న తమ గారాల పట్టి రాహా ఇప్పుడు స్టార్ అయిపోయింది. తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాప చాలా క్యూట్‌గా ఉందంటూ ఒకరు కామెంట్ చేస్తుంటే, రాహా ప్రిన్సెస్‌లా ఉందని మరోకరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తరువాత రహాను చూసి అటు రణబీర్ అభిమానులు, ఇటు అలియా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఈ స్టార్ కపూల్స్ బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెద్దలు ఒప్పించి గత ఏడాది ఏప్రిల్‌లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ నెలలో వీరికి పాప జన్మించింది. తనకు రాహా అని పేరు పెట్టారు. ఇక యానిమల్ సినిమా విజయం రణబీర్‌ను కొత్త ప్రపంచంలోకి ఆహ్వానించింది. ఇన్నాళ్లు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ ఇప్పుడు మాస్ యాక్షన్ చిత్రాలు చేయగలడు అని రుజువైంది. ఆయన అభిమానులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి భారీ హిట్‌ను ఇచ్చారు. ఇక అలియా కూడా రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్స్ సినిమాలతో అలరించింది.