Traffic Challans: ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) వసూల్ కోసం తెలంగాణ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపులో వాహనదారులకు ఊరట కలిగించింది. భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గతంలో కన్నా ఎక్కువ రాయితీ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టేందుకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్‌తోపాటు మీ సేవ కేంద్రాల్లో కూడా పే చేసే అవకాశం ఉంది.
నవంబర్ చివరి వరకు పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. 2022 మార్చి 31వ తేదీ వరకు 2.4 పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా రూ. 300 కోట్ల వరకు వసూల్ చేశారు. దీంతో మరోసారి ఆఫర్ చేశారు. ఇదివరకు టూ వీలర్స్‌కు 75 శాతం, మిగతా వెహికిల్స్‌కు 50 శాతం ఇచ్చారు. ఇప్పుడు దానిని మరింత తగ్గించారు.
ఆర్టీసీ డ్రైవర్స్‌కు 90 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. టూ వీలర్లకు 80 శాతం రాయితీ ఇచ్చారు. గతంలో కంటే 5 శాతం ఎక్కువే ఇచ్చారు. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. లారీలు, ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు.