Sarkaaru Noukari Trailer: ఆసక్తి రేపుతున్న ట్రైలర్
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. ఓ మారుమూల పల్లెలో సాగే కథ. గ్రామీణ ప్రజలకు కండోమ్‌పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో ఆకాశ్ నటన ఆకట్టుకుంది.
Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత (Singer Sunitha) తనయుడు ఆకాశ్ (Akash Goparaju) హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం సర్కారు నౌకరి (Sarkaaru Noukari). అందిరి డెబ్యూ హీరోల్లా కమర్షియల్ ఫార్మాట్‌ను ఎన్నుకోకుండా విభిన్నమైన కథను ఎంచుకున్నారు ఆకాశ్. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు నిర్మిస్తుండగా, శేఖర్. జి దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అందిరిలో ఆసక్తిని రేపుతుంది.
ట్రైలర్లో చూపించినట్లు ప్రభుత్వ ఉద్యోగి అయిన గోపాల్ తన భార్యతో కలిసి మహబూబ్ నగర్లో గల కొల్లాపూర్ గ్రామంలో ఉంటాడు. మండల ఆఫీస్‌లో గోపాల్ పనిచేయడంతో భార్యకు ఊర్లో వాళ్లంత మంచి మర్యాద ఇస్తుంటారు. వీరి కాపురం కూడా అన్యోన్యంగా సాగుతుంది. సర్కార్ ఉద్యోగిగా గోపాల్ చుట్టుపక్కల గ్రామాలల్లో నిరోధ్ వాడకంపై అవగాహన కల్పించాలి. దీంతో ఇది నీచమైన పని అంటూ ఊర్లో వాళ్లు అనడంతో అతని భార్య చులకనగా చూస్తోంది. కుటుంబం కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకోమని అంటుంది. తరువాత హీరో ఏం చేస్తాడనేది సినిమా కథ. సర్కారు నౌకరి అంటే ప్రభుత్వ జీతం తీసుకోవడమే కాదు ప్రజలకు సేవ చేయడం అనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమాలో భావన(Bhavana) కథనాయకగా పరిచయం అవుతోంది.