»High Court Order To Give Details On Medigadda Pillar Incident
Medigadda పిల్లర్ ఇన్సిడెంట్‌పై వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
High Court order to give details on Medigadda pillar incident
Medigadda: మేడిగడ్డ (Medigadda) పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ (Niranjan) పిటిషన్ వేశారు. బ్యారేజీ కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మహాదేవపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని.. దానిని సీబీఐకి (cbi) బదిలీ చేయాలని కోరారు.
పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (cs) లేఖ రాసింది. సీఎస్ శాంతి కుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని స్పష్టంచేసింది. విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.