»Jawan Is An Animal Movie That Broke Rrr Records Rs 800 Crore Collection Worldwide Day 16
Jawan, RRR రికార్డులను బ్రేక్ చేసిన యానిమల్ మూవీ
రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన యానిమల్ మూవీ బాక్స్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా..తాజాగా పఠాన్, జవాన్, RRR వంటి చిత్రాల రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Jawan is an animal movie that broke RRR records rs 800 crore collection worldwide day 16
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించి, రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన హైపర్ వయొలెంట్ క్రైమ్ మూవీ యానిమల్ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికీ మూడవ వారాంతంలో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం 16 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
అంతేకాదు బాలీవుడ్లో అత్యధికంగా వసూళ్లు సాధించిన ఆరవ చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన దంగల్ (రూ.2024 కోట్లు), షారుఖ్ ఖాన్ జవాన్ (రూ. 1,148 కోట్లు), పఠాన్ (రూ. 1,050 కోట్లు), సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ (రూ. 918 కోట్లు), అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ (రూ. 876 కోట్లు) తర్వాత రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన ఆరవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
మరోవైపు Animal మూవీ కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం రికార్డులను ఇక్కడ బ్రేక్ చేసింది.
అంతేకాదు యానిమల్ మూవీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా పఠాన్, జవాన్, బాహుబలి 2, RRR చిత్రాల రికార్డులను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, బాబీ డియోల్ నటించిన ‘యానిమల్’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అదే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. అభిమానులకు ఈ చిత్రం చాలా నచ్చింది. దీని కారణంగా యానిమల్ మూవీ వసూళ్ల దిశగా కొనసాగుతుంది.