»Janasena Leader Nagababu Applied For Vote In Andhrapradesh Ysrcp Slams Him For Already Casted His Vote In Telangana
Nagababu : వివాదంలో చిక్కుకున్న నాగబాబు.. రెండు సార్లు ఓట్లు ఎలా వేస్తారు ?
జనసేన నేత నాగబాబు రెండు ఓట్ల వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Nagababu : జనసేన నేత నాగబాబు రెండు ఓట్ల వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం.. నాగబాబు కుటుంబం ఏపీలో ఓటుకు దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం నాగబాబు ఓటరు దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ దరఖాస్తు చేశారు. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. వైసీపీ శ్రేణులు జనసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో నాగబాబు కుటుంబం ఓటుకు దరఖాస్తు చేసుకుంది. నాగబాబు రెండో ఓటు వేయబోతున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. . బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. తెలంగాణలో ఓటు వినియోగించుకున్న నాగబాబు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఓటు వేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఓటేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఓటు హక్కు ఒకే చోట ఉంటుంది. జనసేన నేత నాగబాబుకు కూడా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే ఈ హక్కు తెలంగాణ లేదా ఏపీలో ఉండాలి. రెండు చోట్లా ఉండడం కుదరదు. అందుకే ఓటు మారినప్పుడు గతంలో ఉన్న హక్కును తొలగించి కొత్త చోట అవకాశం కల్పిస్తున్నారు. ఏపీలో ఓటు హక్కు కోసం నాగబాబు దరఖాస్తు చేసుకోగా.. బూత్ లెవల్ అధికారి విచారణ చేపట్టారు. నాగబాబు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. నాగబాబును వారి ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.