టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని జర్సీ 7కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఏ భారత ఆటగాడు కూడా 7 నంబర్ జర్సీ ధరించేందుకు వీలు ఉండదు.
MS Dhoni: దేశంలో క్రికెట్‌కు ఉన్న ఫాలొయింట్ ఏంటో అందరికీ తెలిసిందే. క్రీడాకారులు ధరించే జర్సీకి కూడా ప్రయారిటీ ఉంటుంది. ఎక్కువ 9 నంబర్ అంటే క్రేజీ ఉంటుంది. ఒకప్పుడు సౌరవ్ గంగూలీ (Ganguly) ఆ నంబర్ ధరించేవాడు. తర్వాత ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా 9 నంబర్ ధరిస్తున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (sachin) 10 నంబర్ ధరించేవాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత ఆ నంబర్ మరెవరికి ఇవ్వలేదు. ఆ నంబర్‌కు బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. జట్టులో ఇతర ఏ ఆటగాడు ఆ నంబర్ ధరించొద్దు. అప్పట్లో శార్వూల్ ఠాకూర్ 10 నంబర్ జెర్సీ వేసుకోవడం చర్చకు వచ్చింది. ఆ వెంటనే మరో నంబర్ తీసుకున్నాడు.
ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అలాంటి గౌరవం దక్కింది. అవును అతను ధరించిన జెర్సీ 7ను కూడా ఎవరికీ ఇవ్వొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. జట్టుకు ధోని అందించిన సేవలకు గానూ ఇలా గౌరవించాలని అనుకుంటుంది. టీమిండియాకు ధోని రెండు ప్రపంచ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ ఒకటి కాగా.. టీ 20 వరల్డ్ కప్ మరొకటి.
60 నంబర్లను రెగ్యులర్ ఆటగాళ్ల కోసం బీసీసీఐ కేటాయించింది. ఏ ఆటగాడు జట్టుకు ఏడాదిగా దూరంగా ఉన్నా సరే అతడి నంబర్‌ను కొత్త ప్లేయర్‌కు ఇవ్వబోమని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్రికెట్లో అడుగిడే కొత్త ప్లేయర్‌కు 30 నంబర్ జెర్సీ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు.