Congo Rains: కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
కొండ చరియలు విరిగి పడటం వల్ల 14 మంది చనిపోయారు. భవనాల శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భీకర వర్షాలకు చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
ఆఫ్రికా (Africa)లోని కాంగో (Congo)లో భీకర వర్షాలు ముంచెత్తాయి. భారీ, కుండపోత వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడ్డాయి. చాలా వరకూ ఇండ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగి పడటంతో 14 మంది దుర్మరణం చెందారు. చనిపోయినవారంతా కూడా ఇబాండాలోని బుకావు కమ్యూన్ నివాసులు అని అధికారులు గుర్తించారు. వర్షం వల్ల చాలా ఇండ్లు కూలిపోవడంతో ప్రస్తుతం వారంతా తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారని, సహాయక చర్యలు చేపట్టినట్లు కమ్యూన్ మేయర్ జీన్ బాలెక్ ముగాబో వెల్లడించారు.
Hundreds of homes have been destroyed and thousands displaced after #floods hit parts of Sud Ubangi province in eastern DR Congo. DR Congo and Tanzania have seen extreme flooding in recent days. pic.twitter.com/bduXRymcBw
కొంత మంది ప్రజలు శిథిలాల కింద ఉన్నాని, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, కాంగోలో వరుస విషాదాలు అతలాకుతలం చేయడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా కుండపోత వర్షాలు కురిశాయి. వాటి కారణంగా కొండచరియలు విరిగిపడి 17 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే.