ATP: SP జగదీశ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ‘స్త్రీ రక్ష’ వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. మహిళల రక్షణను బలోపేతం చేస్తూ, ఫిర్యాదుల త్వరిత పరిష్కారానికి ఈ పోర్టల్ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తూ ఎస్పీ జగదీష్ నేతృత్వంలోని బృందం సాగిస్తున్న కృషిని కొనియాడారు.