అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఏది చేసినా సంచలనమే అని.. మరోసారి యానిమల్ మూవీ ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది యానిమల్. దీంతో సందీప్ రెడ్డి పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో సందీప్ భారీ మొత్తంలో అందుకున్నట్టుగా తెలుస్తోంది.
Animal: ప్రస్తుతం యానిమల్ (Animal) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను రాబడుతోంది. ‘ఏ’ రేటెడ్ సినిమాగా థియేటర్లోకి వచ్చిన యానిమల్‌పై (Animal) ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం అస్సలు స్లో అవడం లేదు. ఈ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌ను షేక్ చేసి.. అదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో దుమ్ముదులిపేశాడు. యానిమల్ ద్వారా ఏకంగా 200 కోట్లు కొట్టేశాడు సందీప్. ఈ మూవీని సందీప్ రెడ్డి సొంత ప్రొడక్షన్ భద్రకాళీ పిక్చర్స్.. టీ-సిరీస్ సంస్థ కలిసి నిర్మించాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో యానిమల్‌ను తెరకెక్కించారు.
పది రోజుల్లోనే 717 కోట్లకు పైగా గ్రాస్.. 432 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది మూవీ. డిసెంబర్ 21న డంకీ వచ్చే వరకు నార్త్.. 22న సలార్ వచ్చే వరకు సౌత్‌లో ఆ మూవీదే హవా కనిపిస్తోంది. అప్పటి వరకు యానిమల్ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసేలా ఉంది. ఈ లెక్కన యానిమల్ భారీ లాభాలను తెచ్చిపెట్టినట్టే. దీంతో సందీప్ భారీ మొత్తంలో లాభాలను తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ మూవీ లాభాలు, డైరెక్టర్‌గా సందీప్ రెమ్యునరేషన్ అంతా కలుపుకుంటే.. 200 కోట్ల వరకు అందుకున్నట్టుగా సమాచారం.
సినిమాలో సందీప్ రెడ్డి బ్రదర్ ప్రణయ్ రెడ్డి హ్యాండ్ కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ములు దుమ్ములేపారనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు సందీప్. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాల్సి ఉంది. ఏదేమైనా.. తెలుగు నుంచి రాజమౌళి, సుకుమార్ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగ.