Fire accident: హైదరాబాద్ రాజేంద్రనగర్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లిలోని టాటానగర్‌లో ఉన్న ఫ్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. గోదాం అంతటా విస్తరించాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం ధాటికి గోదాం మొత్తం దగ్ధమయ్యిందని పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కానీ ఆస్తినష్టం ఎక్కువ మొత్తంలో జరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.