Nayanthara Not Interested To Call A Lady Super Star
Nayanthara: ఒక్కొ తారను అభిమానులు ఒక్కొలా పిలుచుకుంటారు. బిరుదులా కొందరు ఫీల్ అవుతారు. మరికొందరికీ మాత్రం చిరాకుగా ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పేది నయనతార (Nayanthara) గురించే.. ఆమెను ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. అలా పిలవడం అమ్మడికి ఇష్టం లేదట. అలా పిలిస్తే తిట్టినట్టు అనిపిస్తోందని చెబుతోంది.
అన్నపూరణి అనే తమిళ మూవీలో నయనతార (Nayanthara) నటించింది. ఆ మూవీ ఈ నెల 1వ తేదీన విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియోతో మాట్లాడారు. అంతకుముందు ఏమో కానీ.. జవాన్ మూవీ తర్వాత అందరూ తనను లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. అది వారి అభిమానం.. కానీ తనకు అలా పిలవడం ఇష్టం ఉండదని అంటున్నారు. ఇందరి అభిమానం పొందుతున్నానంటే ఇండస్ట్రీ వల్లే తనకు లభించిన గౌరవం అని తెలిపారు. అయినప్పటికీ తనను లేడీ సూపర్ స్టార్ అంటే నచ్చదని చెబుతున్నారు.
అన్నపూరణి మూవీ నయనతారకు (Nayanthara) 75వ సినిమా. సినిమాను నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. చిత్రంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా నయనతార కనిపిస్తారు. నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనేది ఆ యువతి కల.. ఆమె తన కలను ఎలా నెరవేర్చుకున్నది అనే అంశంతో తెరకెక్కించారు. నయనతార టెస్ట్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో మాధవన్, సిద్దార్థ్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
విగ్నేష్ శివన్‌ను నయనతార (Nayanthara) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సరోగసి విధానంలో ట్విన్స్‌కు జన్మనిచ్చారు. నయన బర్త్ డే సందర్భంగా ఇటీవల విగ్నేష్ శివన్ ఖరీదైన కారును గిప్ట్గా కూడా ఇచ్చారు.