»Jr Ntr Party For Netflix Ceo Ted Sarandos Hyderabad
Netflix CEOకు ఎన్టీఆర్ పార్టీ..పిక్స్ వైరల్
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ కొద్దిరోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటివల హైదరాబాద్‌లో పర్యటిస్తున్న అతని బృందం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ క్రమంలో వారికి ఎన్టీఆర్ విందు భోజనం ఏర్పాటు చేయడం విశేషం.
jr NTR party for Netflix CEo Ted Sarandos hyderabad
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్(Ted Sarandos), అతని టీమ్‌కి ఓ పార్టీ ఇచ్చారు. వారిని తన ఇంటికి లంచ్‌కి ఆహ్వానించి ఆథిత్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మీకు, మీ బృందానికి మధ్యాహ్న భోజనానికి హోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మీతో సినిమాలు, ఫుడ్ గురించి సంభాషించడం పట్ల ఆస్వాదించామని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ క్రమంలో వారిని కలిసిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
It was such a pleasure hosting you and your team for lunch Ted Sarandos. Enjoyed our conversation and the afternoon spent together indulging in our love for movies and food. pic.twitter.com/aD82mcM2MY
తారక్(jr ntr), లక్ష్మీ ప్రణతి, కళ్యాణ్ రామ్, దేవర దర్శకుడు కొరటాల శివ, నెట్‌ఫ్లిక్స్ అధికారులు ఈ లంచ్‌కి హాజరయ్యారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ సీఈఓ నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లగా తాజాగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లడం విశేషం. అయితే RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడానికి గల కీలకమైన కారణాలలో నెట్‌ఫ్లిక్స్ కూడా కీలక పాత్ర పోషించింది. అంతేకాదు ఇటీవల వారాల్లో విడుదలైన పలు భారీ చిత్రాలు హాయ్ నాన్న, ఆదికేశవ, సాలార్, గుంటూరు కారంతో సహా రాబోయే చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. మరోవైపు రానా నాయుడు రెండవ సీజన్ కోసం వెంకటేష్, రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ కూడా దీని ద్వారా విడుదల కాబోతుంది.
కొన్ని వారాల క్రితం నెట్‌ఫ్లిక్స్(Netflix CEo) దేవర పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను రికార్డ్ ధరకు కైవసం చేసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు, నందమూరి కళ్యాణ్ రామ్ హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, ఇతరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.