Bapatla: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. చంద్రబాబు ఆగ్రహం
దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని బాపట్లలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వమే అలా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bapatla: బాపట్ల జిల్లాలోని బర్తిపూడిలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. అర్థరాత్రి వేళ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విగ్రహం తల పగలగొట్టి పరారు అయ్యారు. అయితే ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు మరికొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి పూట ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం, ప్రతిపక్ష పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ పనిచేసిన బాధ్యులను కనిపెట్టి వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైకాపా ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన… pic.twitter.com/ktyIOsLAqp
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని విగ్రహాల కూల్చివేతతో వైసీపీ చెరిపేయలేదని అన్నారు. విగ్రహాన్ని కూల్చిన వారితోనే మూడు నెలలలో మళ్లీ ఎన్టీఆర్ విగ్రహం నిర్మిస్తామని చెప్పారు. జై తెలుగు దేశం.. జోహార్ ఎన్టీఆర్ అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుండుగులు విధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకను అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో ప్రజలే వైసీపీ వారికి బుద్ధి చెబుతారని అన్నారు.