ప్రస్తుతం ఎక్కువగా ఆన్లైన్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. తెలియక కొందరు నకిలీ క్యూాఆర్లు స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
QR Code Scam: ఈరోజుల్లో దాదాపు లావాదేవీలన్ని ఆన్లైన్ ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ చేసి ఇంటి దగ్గర నుంచే అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేసే వాళ్లు ఎక్కువగా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నారు. ఈక్రమంలో చాలామంది నకిలీ క్యూఆర్ కోడ్ స్కానర్లు తయారు చేస్తున్నారు. వీటి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. క్యూఆర్ కోడ్లపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కేటుగాళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
ఆన్లైన్ వెబ్సైట్లలో నకిలీ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయంటూ మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. వీటిమీద సరైన అవగాహన లేక చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తరచుగా స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నట్లయితే ఇలాంటి స్కామ్ బారిన పడవద్దు. నిజమైన క్యూఆర్ కోడ్ ఏది, నకిలీ కోడ్ ఏదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రివార్డులు, డబ్బులు వస్తాయంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా కేవలం డబ్బు పంపడానికి మాత్రమే అవుతుంది. ప్రముఖ కంపెనీ పేరుతో ఈ నకిలీ క్యూఆర్ కోడ్లను రూపొందిస్తున్నారు. అలాగే మీ యూపీఐ ఐడీ, బ్యాంక్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.