నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్..ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సరైన డేట్ కోసం వెతుకుతున్నారు మేకర్స్. అయితే..ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రిలీజ్ డేట్ ఇదేనంటున్నారు. కానీ అప్పటికే సలార్ థియేటర్లో ఉండనుంది.
‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)..ఆ తర్వాత చేసిన అమిగోస్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ‘డెవిల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే..ఈ సినిమాను మొదట నవంబరు 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో పోస్ట్‌పోన్ చేశారు. కానీ ఇప్పటి వరకు మరో కొత్త డేట్‌ను లాక్ చేయలేదు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి.
దీంతో డెవిల్(devil)కు సరైన డేట్ దొరకడం లేదు. పోనీ సంక్రాంతికి వద్దామంటే చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందుకే.. సలార్ రిలీజ్ అయిన వారం రోజులు తర్వాత డెవిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా.. 29న డెవిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
కానీ సలార్ హిట్ అయితే.. డెవిల్ను పెద్దగా పట్టించుకునే అవకాశాలు తక్కువ. కాబట్టి.. అప్పటికైనా డెవిల్ రిలీజ్(release) అవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ సలార్ టాక్ తేడా కొడితే మాత్ర డెవిల్ థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వారం రోజుల గ్యాప్‌లో ప్రమోషన్స్ చేసి సినిమా రిలీజ్ చేయడమంటే కష్టమే అంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో చూడాలి మరి.