TG: జగిత్యాలలో కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య మృతి చెందారు. కేసీఆర్ సిద్ధిపేటలో ఇంటర్ చదివినప్పుడు చరిత్ర పాఠాలు చెప్పారు. తన గురువు జైశెట్టి రమణయ్య మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు. గురువుతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జగిత్యాలలో మొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా రమణయ్య నిలిచారు.