Alert అయిన కాంగ్రెస్ హైకమాండ్.. ఎమ్మెల్యే అభ్యర్థులు చేజారకుండా పక్కా స్కెచ్
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్ రావాలని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇప్పటికే డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు.
Congress High Command: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తేలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ (Congress) విజయ దుందుబి మోగించనుంది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయ్యింది.
ఎందుకంటే.. గెలిచిన తమ అభ్యర్థులు చేజారకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ (Congress) టాప్ లీడర్లను రంగంలోకి దింపింది. ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఇప్పటికే రంగంలోకి దింపింది. రేపు ఉదయం సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, రణదీప్ సుర్జేవాలా హైదరాబాద్ వస్తారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు సాయంత్రం హైదరాబాద్ రావాలని ఆదేశాలు జారీచేశారు.
ఎగ్జిట్ పోల్స్ (exit polls) ప్రకారం కాంగ్రెస్ టాప్‌లో (top) ఉంది. అందులో కొందరినీ తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తే.. ఇరకాటంలో పడతామని అనుకుంటుంది. అభ్యర్థులు (Candidates) అందరూ హైదరాబాద్ (Hyderabad) రావాలని స్పష్టంచేసింది. ఉదయం 11.30 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.