Liquor Shops Closed: మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్ !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని వైన్ షాపులను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.
Liquor Shops Closed: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని వైన్ షాపులను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైన్ షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేపు హైదరాబాద్ జిల్లాలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. మద్యం ఫాపులు మూతపడుతున్నాయన్న వార్త తెలియగానే మందుబాబులు వైన్ షాపులకు పరుగుపెడుతున్నారు.
ఎన్నికల సమయంలో రెండు రోజుల వైన్ షాపుల బంద్ కారణంగా ఇటు మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు భారీగా నష్టం వాటిల్లిందని వైన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ రెండు రోజులు వైన్ షాపులు మూసి ఉండడంతో మందు బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించారు. ఈ క్రమంలో రెండు రోజుల్లోనే వైన్ షాపుల యజమానులు కోట్లకు పడగలెత్తారు. అసలు వీకెండ్ అయితే.. ఎంజాయ్ చేయాలంటే డ్రగ్స్ ఉండాలి.. తాగి ఊగిపోవాల్సిందే. అయితే పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ఇవ్వడంతో వారు నిరాశ చెందారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా మందుల షాపులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రేపటి కోసం.. నేడే కావాల్సినంత మందు కొని దగ్గర పెట్టుకుంటున్నారు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.