Nagarjuna Sagar: దెబ్బకు దెబ్బ.. తెలంగాణ పోలీసుల పై కేసు నమోదు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అంశం రోజుకో రచ్చ సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటీగా కేసులు నమోదవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్పైకి అక్రమంగా చొరబడ్డారని.. ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యూరిటీ ఉన్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అంశం రోజుకో రచ్చ సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటీగా కేసులు నమోదవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్పైకి అక్రమంగా చొరబడ్డారని.. ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యూరిటీ ఉన్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తాజాగా ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులపై విజయపురి స్టేషన్లో సెక్షన్ 447, 341 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కృష్ణాజలాల పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో ఇరు రాష్ట్రాల మధ్య పోటీగా కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు నాగార్జునసాగర్ దగ్గర వివాదంలో భాగంగా తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. అటూ అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. నాగార్జునసాగర్ సమీపంలో గురువారం జరిగిన ఘర్షణపై తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. గురువారం ఏపీ పోలీసులు తెలంగాణ భూభాగంలోకి చొరబడ్డారని కేసు నమోదు చేశారు.
కొన్నాళ్లుగా నడుస్తున్న నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం ముగిసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించింది. సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అంగీకరించిన ప్రభుత్వాలు అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకరించాయి.