»Bigg Boss Telugu 7 Arjun Ambati Wins The Ticket To The Finale
Bigg Boss7: టికెట్ టూ ఫినాలే గెలుచుకున్న అంబటి అర్జున్..!
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్ లో లాస్ట్ టాస్క్ గా ఫైనల్ పవరాస్త్రా నిర్వహించారు.
కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రేసు నుంచి ముందుగా శివాజీ, శోభలు ఔట్ కాగా, ఆ తర్వాత ప్రియాంక జైన్, ప్రిన్స్ యావార్, గౌతమ్ కృష్ణ గేమ్ నుంచి తొలగిపోయారు. చివరగా పల్లవి ప్రశాంత్, అమర్, అర్జున్ మిగిలి ఉన్నారు. వీరి ముగ్గురు ఈరోజు చివరి టాస్క్ లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరో బయటకు వచ్చేసింది. ఈ గేమ్ లో మొదటి నుంచి సూపర్ గా ఆడుతూ, ఎవరి సపోర్ట్ లేకపోయినా ఎక్కువ పాయింట్స్ సంపాదించిన అర్జున్ అంబటి ఈ టికెట్ టూ ఫైనల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.
అతను ఈ వారం ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయితే అధికారికంగా బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో మొదటి ఫైనలిస్ట్ అవుతాడు. ఓటింగ్‌లో అర్జున్ చివరి స్థానంలో ఉన్నారని, ఓటింగ్‌లో ఆఖరి ముగ్గురు పోటీదారుల మధ్య పెద్దగా తేడా లేదని చెప్పారు. అనధికారిక సర్వేలో ప్రియాంక, శోభ, అర్జున్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్‌బాస్ సీజన్లో సీజన్ అంతా జరిగిన టాస్క్‌లు ఒకవైపు, ఫైనల్ అస్త్ర టాస్క్‌లు మరో స్థాయిలో సాగుతున్నాయి. అయితే ఆరంభం నుంచి స్కోరుబోర్డులో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమర్ చివర్లో అర్జున్ అంబటి చేతిలో ఓడిపోయాడు.
నిజానికి ఫైనల్ అస్త్ర టాస్క్‌లో అమర్ కంటే అర్జున్ ఎక్కువ టాస్క్‌లు గెలిచాడు. గౌతమ్, శివాజీ, శోభాశెట్టి తమ పాయింట్లను అమర్‌కి అందించడంతో అమర్ రేసులో పోటీపడగలడు. కానీ అర్జున్ ఎవరి దగ్గరా పాయింట్లు తీసుకోకుండా టాప్ 2 స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఫైట్‌లో అమర్‌ను ఓడించాడు. బిగ్ బాస్ తెలుగు 7 ఫైనల్‌కి అర్జున్ అంబటి టికెట్ గెలుచుకోవడంతో అతని అభిమానులు, మద్దతుదారులు సంతోషంగా ఉన్నారు.