Animal Movie: ‘యానిమల్’ ఓటిటి పార్టనర్, సీక్వెల్ టైటిల్ ఫిక్స్!
ఫైనల్‌గా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి నుంచి రెండో సినిమా థియేటర్లోకి వచ్చేసింది. యానిమల్ టైటిల్‌తో వైలెన్స్ చూపిస్తానని చెప్పిన సందీప్.. అందుకు తగ్గట్టే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే యానిమల్ ఓటిటి పార్టనర్, సీక్వెల్ టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయాయి.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
సందీప్ రెడ్డి మరో సాలిడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. అలాగే.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. కుదిరితే 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం.
ఇకపోతే యానిమల్ సినిమా (Animal Movie)కు సీక్వెల్ కూడా ఉండే అవకాశాలున్నాయి. సినిమాలో సీక్వెల్ టైటిల్ రివీల్ చేశారు. యానిమల్ ఎండ్ కార్డ్‌లో ‘యానిమల్ పార్క్’ అంటూ సీక్వెల్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఈ సినిమా కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని అంటున్నారు. మరి ఈ సీక్వెల్‌ను సందీప్ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.