VZM: వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP ఎఆర్. దామోదర్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు, CBI, ED అధికారులమంటూ వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని, ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930, 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.in&e వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు.