Telangana: తెలంగాణ ఎన్నికలు: ‘హిట్ టీవీ’ ఎగ్జిట్ పోల్ సర్వే
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుందనే విషయాన్ని ఆయా సర్వేలు వెల్లడించాయి. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత హిట్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేయగా అందులో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల మనసును గెలుచుకుంది. ఓటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూడంతో ఈసారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Hit TV ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ 51-59, బీఆర్ఎస్ 45-53, బీజేపీ 7-10, ఇతరులు 9-11 సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి మెజార్జీ సీట్లు వచ్చినా హంగ్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర సర్వేల్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయా సర్వేల్లో తేలిన ఎగ్జిట్ పోల్ ఫలితాలేంటో ఒకసారి చూద్దాం.
ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే:
కాంగ్రెస్: 58-67 స్థానాలు
బీఆర్ఎస్: 41-49 స్థానాలు
బీజేపీ: 5-7 స్థానాలు
ఇతరులు: 7-9 స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్: 67-78 స్థానాలు
బీఆర్ఎస్: 22-31 స్థానాలు
బీజేపీ: 6-9 స్థానాలు
ఎంఐఎం: 6-7 స్థానాలు
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్:56 స్థానాలు
బీఆర్ఎస్:48 స్థానాలు
బీజేపీ:10 స్థానాలు
ఇతరులు:5 స్థానాలు
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్: 65-68 స్థానాలు
బీఆర్ఎస్: 35-40 స్థానాలు
బీజేపీ: 7-10 స్థానాలు
ఇతరులు: 6-9 స్థానాలు
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్:
కాంగ్రెస్: 48-64 స్థానాలు
బీఆర్ఎస్:40-55 స్థానాలు
బీజేపీ: 7-13 స్థానాలు
ఎంఐఎం:4-7 స్థానాలు