»Revanth Reddy Said Nagarjuna Sagar Ap Telangana Issue Is Part Of Kcr Plan
Revanth Reddy: నాగార్జున సాగర్ వివాదం..కేసీఆర్ కుట్రలో భాగం
తెలంగాణ ఎన్నికల పోలింగుకు ముందే సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్(nagarjuna sagar) వివాదం పేరుతో తెలంగాణ సెంటిమెంట్ కుట్ర పన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ ఎన్నికల సీఈఓను కోరారు.
నాగార్జున్ సాగర్(Nagarjuna Sagar) వివాదానికి సంబంధించి తెలంగాణ ఎన్నికల సీఈఓ వికాస్ రాజ్ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు. అసలు ఎన్నికల సమయంలో ఎవరు, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో ప్రజలకు తెలుసని రేవంత్ అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలు సీఎం కేసీఆర్ కావాలనే క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజలు నాగార్జున సాగర్ డ్యాం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నీళ్లు ఎక్కడికి పోవని..ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ ఇలా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
తెలంగాణలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగార్జున సాగర్ ఆనకట్ట తమ రాష్ట్రానిదేనంటూ 13వ గేటు వద్ద ఆంద్రప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన పోలీసులు కంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి సాగర్ చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ నీటి పంపకాల విషయంలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రావడంతో తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు(police) ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌లో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. దాదాపు 700 మంది పోలీసులు అర్ధరాత్రి సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు.