MBNR: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు.