»Virat Kohli Take A Break From White Ball Series In South Africa
White Ball Seriesకు విరాట్ కోహ్లీ దూరం
సౌతాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరట. ఈ మేరకు బీసీసీఐకి రన్నింగ్ మిషన్ లేఖ రాశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందుబాటులో ఉంటారని తెలిసింది.
Virat Kohli Take A Break From White Ball Series In South Africa
White Ball Series: సౌతాఫ్రికాతో టీమిండియా వైట్ బాల్ సిరీస్ (White Ball Series) వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ 20, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. సిరీస్ నుంచి బ్రేక్ కావాలని బీసీసీఐకి విరాట్ కోహ్లీ (kohli) లేఖ రాశారు. టీ 20, వన్డేలకు అందుబాటులో ఉండరట.. టెస్ట్ సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని తెలిసింది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికాలో పర్యటించే భారత జట్టును ఎంపిక చేయనుంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ప్రపంచ కప్‌కు ముందు కూడా ఓ సారి కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి 2 వన్డేలకు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ బ్రిటన్‌లో ఉన్నాడు. రోహిత్ మాత్రం వైట్ బాల్ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరోవైపు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంటాక్ట్‌ను బీసీసీఐ పొడగించింది.