»Wine Shops Closed In Telangana From 28th To November 30th 2023
Wine shops: రేపట్నుంచి 3 రోజులు వైన్స్ బంద్..ముందే తెచ్చేద్దామా!
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు(telangana assembly elections 2023) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు(wine shops) మూడు రోజులు బంద్ పాటించున్నాయి. ఈ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
wine shops closed in telangana from 28th to november 30th 2023
తెలంగాణలో రానున్న అసెంబ్లీ(telangana assembly elections 2023) ఎన్నికల దృష్ట్యా వరుసగా మూడు రోజుల పాటు డ్రై డేస్‌గా పాటిస్తూ వైన్ షాపులను(wine shops) బంద్ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు. అదనంగా, నవంబర్ 28న సాయంత్రం 5 నుంచి, నవంబర్ 29న మద్యం దుకాణాలు బంద్ పాటించబడతాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే రేపటి నుంచి వైన్స్ బంద్ అవుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు, యువత ముందే తీసుకునేేందుకు వైన్ షాపుల ముందు బారులు తీరారు.
ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC)కి అనుగుణంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో మద్యం విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తాత్కాలిక మూసివేత గురించి బార్లు, వైన్ షాపుల యజమానులకు ముందుగానే తెలియజేయాలని కూడా సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ లెక్కల్లో చూపని నగదు, బంగారం సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.