Hyderabad: లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో టాప్ 3లో హైదరాబాద్
గత ఏడాదితో పోలిస్తే లగ్జరీ ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయని రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ ఓ నివేదికలో తెలిపింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఎన్ఆర్ఐలు తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకుంటున్నారని పేర్కొంది. అయితే ఈ లిస్ట్‌లో హైదరాబాద్ టాప్ 3లో ఉండటం విశేషం.
Hyderabad: చాలా మందికి సొంత ఇళ్లు(House) ఉండాలనే కల. ప్రస్తుతం అందరి లైఫ్ స్టైల్(Lifestyle) కూడా మారింది. అందుకు తగ్గట్టుగానే అభిరుచులు కూడా మారాయి. కాస్తా ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు ఏదో ఒక ఇల్లు ఉంటే చాలు అనుకోవడం లేదు. నివసించడానికే కాకుండా అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. స్విమ్మింగ్ ఫూల్(SwimmingPool), గార్డెన్, లాంటి వసతులను ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా చాలా మంది బిల్డర్స్ ఇంటిని డిజైన్ చేస్తున్నారు. అందుకే మెట్రోపాలిటన్ నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనుగోలుచేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య మహా నగరాల్లో రూ.4 కోట్లకు పైగా విలువచేసే లగ్జరీ హోమ్స్ భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 97 శాతంకు పెరిగిందని రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ(CBRE) ఓ నివేదికలో వెల్లడించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో డిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, హైదరాబాద్(Hyderabad) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అందులో 37 శాతం వాటాతో ఢిల్లీ ఉంటే, 35 శాతంతో ముంబయి రెండో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ 18 శాతం విక్రయాలతో మూడో స్థానం సంపాదించుకుంది. పుణెలో 4 శాతం లగ్జరీ గృహాలు అమ్ముడైనట్లు సీబీఆర్ఈ పేర్కొంది. ఫైనాన్షిల్ స్టేటస్ పెరగడం, అలాగే జీవన ప్రమాణాలు పెరగడంతో లగ్జరీ హౌస్‌ల అమ్మకాలు భారీగా పెరిగాయని సీబీఆర్ఈ తెలిపింది. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో అక్టోబర్-డిసెంబర్ నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తుంది.