»Maruti Audi Cars Price Increase From January 2024
Cars: కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్..వచ్చే ఏడాదిలో
కార్లు కొనాలని ఎవరైనా అనుకుంటే ఇదే ఏడాది కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది పలు కంపెనీలు పలు మోడల్ కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే వాటిలో ఏయే కంపెనీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
జనవరి 2024 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ(maruti suzuki) సోమవారం ప్రకటించింది. బిఎస్ఇ ఫైలింగ్‌లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా, కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు వాహన తయారీదారు తెలిపింది. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరల పెరుగుదల, వ్యయ ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో కంపెనీ లక్ష్య తేదీని జనవరి 2024కి సవరించిందని MSI స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది. ధరలు పెంచే యోచనలో ఉన్నామని, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి, వృద్ధిని పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎంట్రీ లెవల్ చిన్న కారు మారుతీ ఆల్టో నుంచి మల్టీ యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు అనేక రకాల వాహనాలను ఈ కంపెనీ విక్రయిస్తుంది. వీటి కనీస ధర రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షలుగా పలు మోడల్ కార్లకు రేట్లు ఉన్నాయి. అయితే ఈ ధరలలో ఎంత పెరుగుదల ఉంటుంది? ఏ మోడల్ కార్ల రేట్లను పెంచుతారనే విషయం మాత్రం పేర్కొనలేదు. ఈ సంవత్సరం 1 ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ తన అన్ని మోడళ్ల వాహనాల ధరలను దాదాపు ఒక శాతం పెంచింది.
మారుతి సుజుకి ఇండియా (MSI) అక్టోబర్‌లో అత్యధికంగా 1,99,217 యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 19% వృద్ధి. అక్టోబర్‌లో ఎంఎస్ఐ 1,77,266 యూనిట్లను విక్రయించింది. సంవత్సరం క్రితం కాలంలో 1,47,072 యూనిట్ల నుంచి 21% పెరిగింది. మరోవైపు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి(audi) కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి భారతదేశంలో తన వాహనాల ధరలను 2% వరకు పెంచుతామని ప్రకటించారు. పెరుగుతున్న ఇన్పుట్, నిర్వహణ వ్యయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.