ఇకపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు పొందాలంటే అంతా సులభం కాదు. రుణం పొందాలంటే క్రెడిట్ స్కోర్, సీయూఆర్ ఎంత ఉండాలో ఆర్బీఐ తాజా నిబంధనలు వెలువరించింది. ఖాతా ఉన్న బ్యాంకులోనే రుణం తీసుకోవాలని, అలా చేస్తే అనేక లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
RBI: అన్ సెక్యూర్ లోన్ల విషయంలో ఆర్బీఐ నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. వీటి రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్లకు పెంచింది. దీంతో పర్సనల్ లోన్స్(Personal Loan) పొందాలంటే కష్టంగా మారనుంది. క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లను వాయిదాల్లోకి మార్చుకునే వెసులుబాటూ కష్టతరంగా మారొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొన్ని నియమాలు పాటిస్తే అత్యవసర రుణం పొందడం సులభమౌతుందని అంటున్నారు.
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇకపై లోన్స్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. నమ్మకమైన కస్టమర్లు, మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే లోన్లు వస్తాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు (Credit Card) వాడేవారు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) 30 శాతం మించకుండా చూసుకోవాలి. ఇది వరకు ఈ సీయూఆర్ 50% వరకు ఉన్నా లోన్లు ఇచ్చారు. ఇకపై అలా కుదరకపోవచ్చు. పర్సనల్ లోన్స్, అన్ సెక్యూర్ లోన్స్ కోసం ఓన్ బ్యాంక్‌ను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే రిస్క్ ప్రొఫైల్‌ను అంచనా వేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే నమ్మడం సులభం. అలాగే ఇంట్రెస్ట్‌లో కూడా కొంత ప్రయోజనం ఉండొచ్చు. అప్పు తీసుకున్న తరువాత తగిన తేదీల్లో కట్టాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు.
రుణాలు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్(Credit Score) చూస్తారు. అది 750 తగ్గకుండా చూసుకోవాలి. లోన్ కోసం అన్ని సంస్థలలో దరఖాస్తు చేసుకోవడం సరైనది కాదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్ (Credit Score)పై ప్రభావం పడుతుంది. రుణాల ఇవ్వడంలో ఇప్పటి వరకు ఫిన్‌టెక్ సంస్థలు దూకుడుగా వ్యవహరించాయి. ఇకపై అవి కూడా ఆచితూచి అడుగులేస్తాయి. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ, ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే వాటిపై పెట్టుబడి అధికంగా కావాల్సి వస్తుంది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని చార్జీలు తెలుసుకుని రుణాలు తీసుకుంటే ఉత్తమమని నిపుణుల అంటున్నారు.