Rathika, Ashwini Eliminated To The Bigg Boss House
Rathika, Ashwini: బిగ్ బాస్ హౌస్ సీజన్ 7కు క్రేజ్ పెరుగుతోంది. మరో 3 వారాల్లో రియాలిటీ షో ముగియనుంది. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ దానిని తిరిగి ఇవ్వడంతో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు. దాంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అభిమానుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అశ్విని (Ashwini), రతిక (Rathika) హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అశ్విని శనివారం ఎలిమినేట్ కాగా.. రతిక ఆదివారం అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ రెండు గ్రూపులుగా విడిపోయిందని అశ్విని (Ashwini) చెప్పింది. అమర్, ప్రియాంక, శోభ ఒక గ్రూప్ కాగా.. శివాజీ, యావర్, ప్రశాంత్, రతిక (Rathika) మరో గ్రూప్ అని చెప్పింది. గౌతమ్, అర్జున్ ఏ గ్రూపులో లేరని చెప్పగా.. హోస్ట్ నాగార్జున ఆ గ్రూపులకు పేర్లు కూడా పెట్టారు. శోభ, ప్రియాంక, అమర్ గ్రూపుకు స్పా అని.. వీళ్లను చుక్క బ్యాచ్, స్టార్ అంటారని తెలిపారు. శివాజీ, ప్రశాంత్, యావర్ గ్రూప్ స్పై అని.. వీళ్లను మొక్క బ్యాచ్ అంటారని వివరించారు. రెండు గ్రూపులకు చెందని వారు తొక్క బ్యాచ్ అని ఆటపట్టించారు.
ఆదివారం చివరికి అర్జున్, రతిక ఉన్నారు. ఆ సమయంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా అని ప్రశాంత్‌ను నాగార్జున అడిగారు. కానీ 14వ వారం వరకు చూస్తానని.. ఇప్పుడే వాడనని చెప్పారు. వాడాలని ప్రియాంక కోరింది.. అయినప్పటికీ వినలేదు. దీంతో రతిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. వెళుతూ.. అందరూ చక్కగా ఆడుతున్నారని పేర్కొంది. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఇవ్వకున్న ఫర్లేదని కామెంట్ చేయడం గమనార్హం.