టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా మెగా 154 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇందులో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. పైగా బాబీ ఊర మాస్ కంటెంట్‌తో.. మరోసారి గ్యాంగ్ లీడర్‌లోని మెగాస్టార్‌ను చూపించబోతున్నాడు.
చిరు అప్ కమింగ్ ఫిల్మ్స్‌లో కూడా మెగా 154పైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. ఇప్పుడు వెంకటేష్ కూడా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వెంకీ గెస్ట్ రోల్లో మెరవనున్నాడట. ఇప్పటికే వెంకీ అందుకు సై అన్నట్టు టాక్. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మెగాస్టార్ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేస్తే మాత్రం.. అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవితేజ మాత్రం రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే మెగా 154 ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.