చంద్రయాన్3 (Chandrayan-3) విజయం తర్వాత భారత్ మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఇస్రో (ISRO) ఆదిత్య ఎల్1 ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్య ఎల్1 (Aditya L1) చివరి దశకు చేరుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. చంద్రునిపై పరిశోధనలు చేసిన తర్వాత ఇప్పుడు సూర్యునిపై ప్రయోగాలు చేసేందుకు ఆదిత్య ఎల్1ను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది చివరి దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (S.somanadh) వెల్లడించారు.
Dr. Somanath has said, the final maneuvers to place #AdityaL1 into a halo orbit around the L1 point are expected to be completed by 7 January, 2024! 🛰☀️ #ISROpic.twitter.com/ZbeYvi1c2Z
ఇస్రో (Isro) ప్రయోగించిన ఆ ఉపగ్రహం ఎల్1 పాయింట్లో ప్రవేశపెట్టేందుకు వచ్చే ఏడాది జనవరి 7వ తేదిన మరిన్ని విన్యాసాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. భారత్ తొలిసారి రాకెట్ (Rocket)ను ప్రయోగించి 60 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో (Vikram sarabai Space Centre) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలోనే ఆదిత్య ఎల్1 శాటిలైట్‌కు సంబంధించి కీలక విషయాలను తెలిపారు.
ఆదిత్య ఎల్1 తన మార్గంలో వెళ్తోందని, ప్రస్తుతం అది చివరి దశకు చేరుకుందని ఎస్.సోమనాథ్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదిన ఇస్రో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీసీ-57 వాహనం ద్వారా ఆ శాటిలైట్‌ను (Satellite) ఇస్రో ప్రయోగించింది. సూర్యుని కక్ష్యపై, అక్కడి వాతావరణ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. సూర్యుని (SUN)పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఇదే కావడం విశేషం.