Yash: అందుకే లేట్ అవుతోంది.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ
మామూలుగా అయితే యష్ ప్లేస్‌లో మిగతా హీరోలు ఉండి ఉంటే.. ఈపాటికే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉండేవారు. కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు యష్. తాజాగా దీనికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు యష్.
That's why it's getting late.. Clarity on Yash Next
Yash: కేజిఎఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్ (Yash). ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్ చాప్టర్ 2 ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి.. యష్‌ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. అందుకే.. యష్ (Yash) నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ కెజియఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా.. ఇప్పటికీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు యష్. ఫలానా డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. క్లారిటీ ఇవ్వడం లేదు.
మలయాళ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌తో ఓ సినిమా ఉంటుందని.. రణబీర్ కపూర్ రాముడిగా బాలీవుడ్లో తెరకెక్కనున్న రామాయణంలో.. యష్ రావణుడిగా కనిపించనున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఛత్రపతి శివాజీగా కూడా నటిస్తున్నాడనే టాక్ ఉంది. కానీ ఎలాంటి అఫిషీయల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యష్.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి గల కారణాలను వెల్లడించాడు. ప్రస్తుతం తాను రిలాక్స్ కావడం లేదని, తాను ఏదైనా చేస్తున్నానంటే అదంతా తన అభిమానులు తనకు ఇచ్చిన ధైర్యమేనని అన్నారు.
తన అభిమానులకు సగం వండిన ఆహారాన్ని అందించడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అందరూ గర్వించేలా సినిమా చేస్తానని, అందుకోసం అభిమానులు కాస్త ఓపిక పట్టాలని కోరారు. ఖచ్చితమైన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు యష్. కాబట్టి స్వయంగా యష్ చెప్పేవరకు తదుపరి సినిమా పై క్లారిటీ రాదు. మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చూడాలి.