పవన్ కళ్యాణ్‌పై ఓ వ్యక్తి చెప్పు దాడికి యత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అది ఇప్పటి వీడియో కాదని, కొందరు కావాలనే పవన్ కళ్యాణ్‌పై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని జనసైనికులు హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) జనసేన పార్టీ (Janasena) బీజేపీతో పాటు బరిలోకి దిగుతోంది. అయితే జనసేన పార్టీ అభ్యర్థులు మాత్రం 8 చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నారు. బీజేపీ (BJP)కి జనసేన మద్దతు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ అభ్యర్థుల కోసం ప్రచారంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ పాలనపై, నిరుద్యోగులపై తన మాటలను వినిపించారు. జనసేనను కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా విమర్శించినట్లు లేదు. అయితే తాజాగా జనసేనాని పవన్‌పై చెప్పులతో దాడి యత్నం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త!!
కొత్తగూడెంలో నిన్న పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తింపు. pic.twitter.com/lVltw8UwOf
కొత్తగూడెం (Kothagudem)లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రచార సభ నిర్వహించేందుకు వెళ్తుండగా ఓ వ్యక్తి చెప్పులతో దాడి చేసేందుకు యత్నించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే అక్కడున్న జనసేన కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లుగా ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. గతంలో దాడికి యత్నించిన వ్యక్తి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తీసుకున్న ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదేళ్ల క్రితం జరిగిందని, గతంలో ఖమ్మం ప్రచార సభలో ఈ ఘటన జరిగినట్లు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. పవన్ తెలంగాణలో అడుగు పెట్టడం కొందరికి నచ్చడం లేదని, కావాలనే వారు ఇలాంటి వీడియోలను తెరపై తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నా వదిలేది లేదని జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనసేనానిపై చెప్పుల దాడి యత్నానికి సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై జనసైనికులు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.