High Court Order Police For The Protection Of Barrelakka
Barrelakka: తెలంగాణ హైకోర్టులో బర్రెలక్క (Barrelakka) శిరీషకు ఊరట కలిగింది. ఆమెకు భద్రత కల్పించాలని హైకోర్టు ధర్మాసనం పోలీసు శాఖను ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఒక గన్ మెన్‌తో ప్రొటెక్షన్ ఇవ్వాలని స్పష్టంచేసింది. గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకే కాదు.. స్వతంత్ర్య అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది.
కొల్లాపూర్ నుంచి బర్రెలక్క స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తనకు ఉద్యోగం రాలేదని.. బర్రెలు కొనుక్కొని జీవిస్తున్నానని వీడియోలు చేసింది. అలా బర్రెలక్క గుర్తింపు పొందింది. ఈ సారి ఎన్నికల బరిలో దిగింది. ఆమెకు విజిల్ గుర్తు కేటాయించారు. నియోజకవర్గంలో జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 21వ తేదీన బర్రెలక్క ఆమె తమ్ముడిపై దాడి జరిగింది. తనకు భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. 2+2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని కోరగా.. 1+1తో భద్రత కల్పించాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది.