Konda Surekha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కొండా సురేఖ (Konda Surekha) వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఇతర పార్టీ కార్యాలయంలోకి వెళ్లి హల్ చల్ చేశారు.
బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయంలోకి కొండా సురేఖ (Konda Surekha) వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. తనను గెలిపించాలని అక్కడ ఉన్న నేతలను రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ పార్టీలోకి రావడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు షాక్‌నకు గురయ్యారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దానికి ర్యాగింగ్ లెవల్ 100 శాతం అని కామెంట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి కొండా సురేఖ (Konda Surekha) బయటకు వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా కొండా సురేఖ (Konda Surekha) మారారు. ప్రత్యర్థి పార్టీ నేతలను కూడా ఒకసారి హడలెత్తించారు.