»Konda Surekha Kondas First Signature As A Minister
Konda Surekha: మంత్రిగా కొండా తొలి సంతకం
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలి సంతకం దేని మీద చేశారంటే?
Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలి సంతకం చేశారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేసియా పెంచే ఫైల్‌పై ఆమె తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అలాగే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులకు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తూ.. మరో ఫైల్‌పై కూడా ఆమె సంతకం చేశారు. ఆ తర్వాత అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఇప్పటి వరకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖల్లో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. నిత్యం అందుబాటులో ఉంటాను.. సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. జట్టుగా పనిచేసి లక్ష్యాలు సాధించాలి. అలాగే పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపునకు అందరూ కార్యసాధకులుగా పనిచేయాలని అన్నారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షలు చేపడతామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈమె బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, అటవీ, ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.