Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్లో వేడుకలు ప్రారంభం అయ్యాయి. తన చెల్లి పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిలో భాగంగా హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తన చెల్లెలు అడివి షిర్లీ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమ్మ, నేను, నా చెల్లి ముగ్గురం హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేశాం. బేబీ సిస్టర్ కు పెళ్లవుతోంది. మా ఫ్యామిలీలోకి మా బావ డేవిన్ కు స్వాగతం అంటూ హల్దీ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అడివి శేష్ ఇన్ స్టాలో పంచుకున్నాడు.
Adivi Sesh : హిట్ 2 తో హిట్ కొట్టిన అడివి శేష్
ఇటీవల అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయంతో మాంచి జోష్ మీదున్నాడు శేష్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గూఢచారి సినిమా సీక్వెల్ గూఢచారి 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు.