»Netizens Are Angry With Amitabh Bachchan For Not Watching Australia Vs India World Cup Final Match
Amitabh Bachchan: అమితాబ్ మ్యాచ్ చూడకపోతేనే కప్ గెలుస్తాం
అమితాబ్ బచ్చన్ ఫైనల్ మ్యాచ్ చూడొద్దు అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఆయన చూడపోతేనే కివీస్ భారత్ ఘన విజయం సాధించిందని, అందుకే ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండండి అని అభ్యర్ధిస్తున్నారు. దీనిపై బిగ్ బీ సైతం స్పందించడం విశేషం.
Netizens are angry with Amitabh Bachchan for not watching Australia vs India World Cup final match
Amitabh Bachchan: వన్డే వరల్డ్‌కప్ 2023(World Cup 2023) ఎంతో ఉత్కంఠభరితంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ బిగ్ ఫైట్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు అనేక కూడళ్లలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. టీమిండియా(Team India) గెలువాలని పూజలు, యాగాలు చేస్తున్నారు. ఈ సారి గెలిస్తే ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ తీసుకొవచ్చని ఆశపడుతున్నారు. దీని కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)ను మ్యాచ్ చూడొద్దని, తమ కోసం త్యాగం చేయాలని కోరుతున్నారు. అదేంటి అంటారా.. దీని వెనక ఓ కారణం ఉంది. బిగ్ బి మ్యాచ్‌ను వీక్షిస్తే భారత్ ఓడిపోతుందని భావిస్తున్నారు. అందుకోసం ఈ మ్యాచ్‌ను త్యాగం చేయమని నెట్టింట్లో కోరుకుంటున్నారు.
సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత బచ్చన్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఆయన చూడకపోతేనే మనం గెలుస్తామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్ కావవడంతో దీనిపై క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. ఈ ఒక్క సారి ఇండియా కోసం త్యాగం చేయండి అని కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై అమితాబ్ స్పందించడం విశేషం. ఇన్ని అభ్యర్థనలను విన్న అమితాబ్ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలా, వద్దా అని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.