Movie Review : మంగళవారం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
ఆర్ఎక్స్ 100` తర్వాత అజయ్ భూపతి(Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్లో రూపొందిన `మంగళవారం` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. చైతన్యకృష్ణ, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషించారు. టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించిన సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మహాలక్ష్మీపురం(Mahalakshmipuram)లోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతారు. మరో జంట గురించి కూడా రాతలు కనిపించడం, వారు చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. గ్రామదేవత (Village deity) మాలచ్చమ్మ జాతర జరిపించకపోవడమే ఈ మరణాలకు కారణమని ఊరి ప్రజలు భావిస్తారు.ఈ మిస్టరీ మర్డర్స్ (Mystery Murders) వెనుక ఏదో కుట్ర ఉందని ఎస్ఐ (నందితాశ్వేత)భావిస్తుంది. కానీ ఊరి జమీందారు ప్రకాశం (చైతన్య కృష్ణ) మాటలకు కట్టుబడి ఇమె విచారణకు ఎవరూ సరిగా సహకరించరు. ఆ హత్యలకు వెనుక ఉన్న కోణం ఏమిటి? వారు చనిపోయారా? చంపబడ్డారా? ఈ హత్యలకు శైలుకు (పాయల్ రాజ్‌పుత్) సంబంధం ఉందా? మహాలక్ష్మీపురం నుంచి ఆమె వెలివేయబడటానికి కారణం ఏమిటి? దెయ్యం రూపంలో ఊరిలో శైలు తిరుగుతోందని గ్రామ ప్రజలు ఎందుకు భ్రమపడ్డారు? శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఏమయ్యాడు? శైలుకు ఉన్న మానసిక సమస్యకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నదే మంగళవారం సినిమా కథ.
విశ్లేషణ
సెక్సువల్ డిజార్డర్ ప్రధానంగా మంగళవారం కథను రాసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi). ఆ పాయింట్‌ను చూపించడం కోసమే పాయల్ రాజ్‌పుత్ పాత్రను పూర్తిగా బోల్డ్‌గా ఆవిష్కరించాడు. ఆ బోల్డ్ కంటెంట్ యూత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తాయి.మంగళవారం'(Mangalavaram) జానర్ ఏంటి? థ్రిల్లర్, హారర్, మెసేజ్,రివేంజ్ డ్రామా.. ఒక్క గాటిన సినిమాను కట్టలేం! ఒక్క జానర్‌కు పరిమితం చేయలేం! మూవీ అంతా ఒక్క విషయాన్ని మాత్రం అజయ్ భూపతి మైంటైన్ చేశారు. సస్పెన్స్ కంటిన్యూ అయ్యింది. కొత్తగా వచ్చిన ఎస్సై మాయా (నందితా శ్వేత) మీద ఊరి జనాలు అనుమానపడతారు.. ఎస్సై మాయ ఏమో ఊర్లోని కొంత మంది వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. ఊరి పెద్ద జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ), వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు (అజయ్ ఘోష్), గురజ (శ్రీ తేజ్), ఆర్ఎంపీ విశ్వనాథం (రవీంద్ర విజయ్)లాంటి కొంత మంది మీద అనుమానం వ్యక్తం చేస్తుంటుంది. అసలు ఈ చావులన్నంటి వెనకాలు ఉన్న కథ ఏంటి? శైలు జీవితంలోకి వచ్చిన మధన్ (అజ్మల్ అమీర్) వ్యవహారం ఏంటి? శైలుని ఊరి జనాలు ఏం చేశారు? శైలుకి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఊరి పెద్ద జమీందారు ఏం చేశాడు? జమీందారు భార్య రాజేశ్వరీ దేవి పాత్ర ఏంటి?
నటన
దర్శకుడిగా అజయ్ భూపతి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మహాసముద్రంను తీసిన విధానం గొప్పగానే ఉంటుంది.. కానీ ఆ పాయింట్‌ను జనాలు తీసుకోలేకపోయారు. మంగళవారంలోనూ అజయ్ భూపతి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. పస్ట్ఆప్ సో సోగా అనిపిస్తుంది. కాకపోతే గ్రిప్పింగ్‌గానే ముందుకు సాగుతుంది. అన్ని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో చూపించినట్టుగానే చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం కాస్త నెమ్మదిగా, నీరసంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పీక్స్‌కు చేరుతుంది. అవే ఈ చిత్రానికి బలం. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. నిడివి పెద్ద సమస్యగా ఏమీ అనిపించదు. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. రెండో పార్టుకు కూడా రెడీగానే ఉన్నాడు అజయ్ భూపతి.నటీనటుల విషయానికి వస్తే.. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)గొప్ప నటి ఏం కాదన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఒకే హావభావంతో కనిపిస్తుంది. ఎప్పుడూ ఏడుస్తూ కనిపించే పాత్రే కావడంతో తేడా ఏం తెలియదు. కానీ పాయల్‌ను ఎలా చూపించాలి. ఎలా చూపిస్తే ఆడియెన్స్(Audience)కు నచ్చుతుంది అన్నది అజయ్ భూపతికి మాత్రమే తెలుసేమో. ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రీతేజ్, అజ్మిల్, శ్రావణ్ రెడ్డి,అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్ ఇలా ప్రతీ ఒక్క పాత్ర బాగుంటుంది. అన్ని కారెక్టర్లను అజయ్ భూపతి చక్కగా రాసుకున్నాడు.
ప్లస్ పాయింట్లు
+ పాయల్ నటన.. గ్లామర్
+ అజనీష్ సంగీతం
+ ద్వితీయార్ధంలో ట్విస్ట్‌లు
మైనస్ పాయింట్లు
– నెమ్మదిగా సాగే కథనం..
– ముగింపు
చివరిగా: మంగళవారం.. బోల్డ్ థ్రిల్లర్ (Mangalavaram Movie Review telugu)