Anand Mahindra Surprised After Seeing Look Like Of Him
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. రకరకాల వీడియోలను పంచుకుంటారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక ఫోటో వచ్చింది. అచ్చం ఆయన లాగా ఉన్న వ్యక్తి ఫోటోను ఒకరు షేర్ చేశారు. దానిపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో స్పందించారు.
పుణెకు చెందిన ఒకరు ఆ ఫోటో షేర్ చేశారు. ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి అచ్చం మీ లాగే ఉన్నారు కదా.. అతను మా కొలిగ్ అని ఆ పోస్ట్ కింద రాశారు. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఫోటో చూస్తుంటే మేం ఎప్పుడో విడిపోయినట్టు ఉన్నాం అని బదులిచ్చారు. చిన్నతనంలో.. తిరునాళ్ల సమయంలో తప్పిపోయి ఉంటాం అని సెటైర్లు వేశారు. ఫోటోపై నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అతను నిజంగా మీ కుటుంబ సభ్యుడు అయితే.. ఫ్యామిలీ సాంగ్ పాడి నిర్ధారించుకోండి అని ఒకరు సలహా ఇచ్చారు. అతను కోర్టుకు వెళితే మీ సోదరుడు కాదని నిరూపించుకోవాల్సి ఉంటుందని మరొకరు సజెస్ట్ చేశారు. అతను చూడడానికి అచ్చం మీ లాగే ఉన్నారు. అతను మీ డిజిటల్ ట్విన్ అని.. నిజంగానే కుంభమేళాలో తప్పిపోయి ఉంటాడని మరొకరు అభిప్రాయపడ్డారు.