PLD: ఈనెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు పల్నాడు జిల్లాలో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి నీలావతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు.