W.G: నక్కపల్లి వద్ద ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం కూటమి ప్రభుత్వ విజయమని APBOC WWB ఛైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రూ.1,35,964 కోట్లతో నిర్మించే ఈ పరిశ్రమ ద్వారా లక్ష మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేశ్ కేంద్రంతో చర్చించి ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు.