SRCL: చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి తిమ్మాపూర్ గ్రామంలో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. వడగండ్ల వర్షంతో పంటలు నష్టపోయిన వివరాలను అధికారులు సేకరించారు. పంట నష్టం నివేదికను ఉన్నత అధికారులకు అందించనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు పేర్కొన్నారు.