»Revanth Reddy Said That The Real Reason For Going To Jail Was Errabelli Dayakar Rao
Revanth Reddy: నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లినే కారణం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఆయన తనను జైలుకు పంపించాడని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) రెండు పార్టీల నడుమ గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీ నాయకులు తమ ప్రచారాలను విసృతం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ జైలుకు వెళ్లడానికి ముఖ్య కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే అని ఆరోపించారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పడు ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిశారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో సమయంలో శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని విమర్శించారు. పాలకుర్తికి ఆయన చేసిన అభివృద్ది ఏం లేదని నియోజవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో మాట్లాడారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని అన్నారు.
కేసీఆర్(KCR) తో పాటు ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని కూడా రాజకీయంగా బొంద పెట్టాలని ఓటర్లను కోరారు. 10 సంవత్సరాల అంహాకార ప్రభుత్వాన్ని గద్దేదించాలని వెల్లడించారు. ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కలిసి చేస్తున్న కుట్రలను అందరూ గమనించాలని అన్నారు. బీఆర్ఎస్ అరాచకపు పాలనకు బీజేపీ తోడు అయిందని, ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ లీడర్లపై దాడులు చేస్తున్నారని, కీలక నేతల ఇళ్లపై ఐటీ సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే అందరూ అర్థం చేసుకోవాలి.. ఈ ఎన్నికల్లో ఎవరు మోసపోవద్దని వెల్లడించారు.